కళ్లన్నీ రోహిత్‌పైనే..
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:33 AM
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్లు నిర్ణాయక ఆఖరి మ్యాచ్ కోసం ఆదివారం బరిలోకి...
మధ్యాహ్నం 3.30కు
సోనీ స్పోర్ట్స్‌లో..
ఇంగ్లండ్‌తో భారత్
మూడో వన్డే నేడు
సిరీస్ లక్ష్యంగా ఇరుజట్లు
లండన్: ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్లు నిర్ణాయక ఆఖరి మ్యాచ్ కోసం ఆదివారం బరిలోకి దిగుతున్నాయి. రెండు వన్డేలను ఇరు జట్లు ఒక్కోటి గెలుచుకొని 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఆఖరిదైన మూడో వన్డే సిరీ్‌సను ఖరారు చేసేదే కాకుండా, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు కూడా చివరి మ్యాచ్ అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వీటన్నింటినీ కొట్టిపారేయడంతో అతడి ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఈ సిరీ్‌సలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ రాణించలేదు. దీంతో లార్డ్స్ పోరులో అతడిపై ఒత్తిడి ఉండడం ఖాయం.
బ్యాటింగ్ మెరుగుపడాల్సిందే..: ఈ నిర్ణాయక మ్యాచ్‌లో భారత్ నెగ్గాలంటే బ్యాటింగ్ విభాగం మెరుగుపడాల్సిందే. గిల్, విరాట్, శ్రేయాస్ మాత్రమే ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు. పేసర్లు బుమ్రా, బ్రార్, ప్రసిద్ధ్ ఫర్వాలేదనిపిస్తున్నారు. ఆల్‌రౌండర్ సుందర్ గాయపడడంతో అతడి స్థానంలో స్పిన్నర్ హర్ష్ దూబేను రప్పించారు. అయితే ఈ మ్యాచ్‌లో కుల్దీప్ లేక దూబేలలో ఎవరిని ఆడిస్తారనేది వేచిచూడాల్సిందే.
జోష్‌లో ఇంగ్లండ్: అటు ఇంగ్లండ్ జట్టులో వెటరన్ జో రూట్ అసాధారణ బ్యాటింగ్‌తో రాణిస్తున్నాడు. దీనికితోడు ఓపెనర్లు బెథెల్, డకెట్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ రాణిస్తే ఆ జట్టుకు భారీస్కోరు ఖాయమే. ఇక, పేసర్లు చెలరేగుతుండడంతో ఇంగ్లండ్ జోష్‌లో ఉంది. ఇదే జోరుతో సిరీ్‌సను పట్టేయాలనుకుంటోంది. మరోవైపు లార్డ్స్‌లో భారత్ గెలిచి 22 ఏళ్లు అవుతుండడం గమనార్హం.
తుది జట్లు (అంచనా)
భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, విరాట్, శ్రేయాస్, రాహుల్, అక్షర్, శివమ్ దూబే, కుల్దీ్‌ప/హర్ష్ దూబే, బ్రార్, బుమ్రా, ప్రసిద్ధ్.
ఇంగ్లండ్: డకెట్, బెథెల్, రూట్, బ్రూక్ (కెప్టెన్), బట్లర్, సామ్ కర్రాన్, జాక్స్, అట్కిన్సన్, ఆర్చర్, రషీద్, సకీబ్.
ఇవి కూడా చదవండి:
'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!