మ్యాచ్ రద్దయితే మనం ఇంటికే!
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:52 AM
టీ20 వరల్డ్‌క్‌పలో గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనుంది. రెండు వేదికల్లోనూ ఇప్పటికి వాతావరణం...
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌క్‌పలో గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనుంది. రెండు వేదికల్లోనూ ఇప్పటికి వాతావరణం బాగానే ఉంది. అయితే, అనుకోని రీతిలో వరుణుడు అడ్డుపడితే? ఏంటి పరిస్థితి అనే అనుమానం ఫ్యాన్స్‌లో నెలకొంది. కాగా, నాకౌట్ మ్యాచ్‌లైన సెమీ్‌సతోపాటు ఫైనల్‌కు రిజర్వు డేలను ముందుగానే ప్రకటించారు. తొలి రోజు ఆట ఆగితే.. రెండో రోజు అక్కడి నుంచే మ్యాచ్‌ను కొనసాగిస్తారు. రిజర్వు డే రోజు కూడా మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితుల్లో రద్దు చేసి సూపర్-8 దశలో మెరుగైన ప్రదర్శన కనబరచిన జట్టును ఫైనల్‌కు చేరినట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇంగ్లండ్‌తో టీమిండియా మ్యాచ్ రద్దయితే.. ఇంగ్లిష్ టీమ్ టైటిల్ పోరుకు చేరుకోనుంది. డిఫెండింగ్ చాంప్ భారత్‌కు నిరాశే ఎదురవుతుంది. సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దయితే.. సఫారీలు ఫైనల్ చేరుకొంటారు.
మ్యాచ్ రెఫరీలుగా: భారత్-ఇంగ్లండ్ సెమీస్ పోరుకు ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) మ్యాచ్ రెఫరీగా వ్యవహరిస్తాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్ పాలేకర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. సౌతాఫ్రికా-కివీస్ పోరుకు శ్రీనాథ్ మ్యాచ్ రెఫరీగా.. రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ ఫీల్డ్ అంపైర్లుగా పనిచేయనున్నారు.
గ్రహణం ఎఫెక్ట్..
చంద్ర గ్రహణం కారణంగా ప్రాక్టీస్ సెషన్‌ను టీమిండియా ఓ గంటపైగా ఆలస్యంగా ఆరంభించింది. సాయంత్రం ఆరు గంటలకు సెషన్ మొదలవ్వాల్సివుండగా, భారత ఆటగాళ్లు గ్రహణం ముగిశాక రాత్రి 7.20కి మైదానంలోకి వచ్చారు. ముందుగా కొందరు సహాయ సిబ్బంది.. ఆ తర్వాత ప్లేయర్లు, కోచ్‌లు వచ్చారు. గ్రహణ సమయాన్ని అశుభంగా భావించడం వల్లే ప్రాక్టీస్‌ను కొంత ఆలస్యం చేసినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: సెమీస్‌కు మ్యాచ్ రెఫరీలు వీరే!
కోహ్లీ ఎప్పటికీ ఆర్సీబీని వీడడు: మో బోబాట్