Share News

ఒత్తిడంతా భారత్‌పైనే..

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:48 AM

ఐర్లాంట్‌లాంటి బలహీన జట్టు చేతిలో వైట్‌వా్‌షకు గురైన టీమిండియా.. ఇప్పుడు మరింత కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ జరుగనుంది. పొట్టి ఫార్మాట్‌లో...

ఒత్తిడంతా భారత్‌పైనే..

  • వైభవ్‌కు చోటు కష్టమే!

  • పటిష్టంగా ఇంగ్లండ్‌

  • నేటి నుంచి ఐదు టీ20ల సిరీస్‌

రాత్రి 10 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..

చెస్టర్‌ లీ స్ర్టీట్‌: ఐర్లాంట్‌లాంటి బలహీన జట్టు చేతిలో వైట్‌వా్‌షకు గురైన టీమిండియా.. ఇప్పుడు మరింత కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ జరుగనుంది. పొట్టి ఫార్మాట్‌లో వరుసగా 12 సిరీ్‌సలు గెలిచిన టీమిండియాకు ఐర్లాండ్‌ చెక్‌ పెట్టడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇక కొత్త కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌కు ఆ సిరీస్‌ చేదు అనుభవాన్నే మిగిల్చింది. అంతేకాకుండా బెల్‌ఫాస్ట్‌ పిచ్‌పై ఐరిష్‌ పేసర్ల ధాటికి ఇతర బ్యాటర్లు కూడా తమ దూకుడైన ఆటతీరును ప్రదర్శించలేకపోయారు. అందుకే భారత జట్టుకు ఇంగ్లండ్‌తో ఈ ఐదు మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. అటు కివీ్‌సతో టెస్టు సిరీస్‌ ఓటమి, బెన్‌ స్టోక్స్‌ రిటైర్మెంట్‌ నేపథ్యంలో ఆతిథ్య ఇంగ్లండ్‌ పొట్టి ఫార్మాట్‌లో బరిలోకి దిగబోతోంది. పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ఆతిథ్య జట్టు భారత్‌పై ఆరంభంలోనే పైచేయి సాధించాలనుకుంటోంది.

తుది జట్టు కూర్పు ఎలా?

ఐర్లాండ్‌తో సిరీస్‌ ఓడడంతో వైభవ్‌ను ఆడించాలన్న డిమాండ్‌ ఎక్కువైంది. అందుకే ఇంగ్లండ్‌లోనైనా అతడి అరంగేట్రం ఉంటుందా? లేదా? అనే ఆసక్తి వ్యక్తమవుతోంది. కానీ అతనికి చోటివ్వాలంటే జట్టు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎందుకంటే అభిషేక్‌, శాంసన్‌లలో ఒకరిని తప్పిస్తేనే వైభవ్‌కు అవకాశం దక్కుతుంది. అదే జరిగితే వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్టవుతుందనే ఆలోచన కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మదిలో ఉంది. అయితే కేవలం వైభవ్‌ను తీసుకున్నంత మాత్రాన అంతా ఓకే అనుకుంటే పొరపాటే. ఐర్లాండ్‌తో సిరీ్‌సలో టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్‌ కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇంగ్లండ్‌లోనూ దాదాపు అలాంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి భారత్‌ తమ వ్యూహాలకు పదును పెట్టాల్సిందే. స్పిన్నర్‌ వరుణ్‌ జట్టులో చేరడం సానుకూలాంశం కానుంది.

బ్యాటింగే బలంగా..

ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు పవర్‌హిట్టర్లతో పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌, బట్లర్‌, బెథెల్‌, విల్‌ జాక్స్‌, ఫిల్‌ సాల్ట్‌, టామ్‌ బాంటన్‌లతో ఎదురుదాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇక వీరి పేస్‌ కూడా ఆర్చర్‌, టంగ్‌, సకీబ్‌ మహ్మూద్‌, సొన్నీ బేకర్‌లతో బలంగా కనిపిస్తోంది. అయితే టెస్టు సిరీ్‌సలో ఆడిన ఆర్చర్‌ను ఈ మ్యాచ్‌ నుంచి తప్పించవచ్చు.


తుది జట్లు: (అంచనా)

భారత్‌: శాంసన్‌/వైభవ్‌, అభిషేక్‌, ఇషాన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, అక్షర్‌, అర్ష్‌దీప్‌, హర్షిత్‌, ప్రిన్స్‌ యాదవ్‌, వరుణ్‌.

ఇంగ్లండ్‌: సాల్ట్‌, బట్లర్‌, బ్రూక్‌ (కెప్టెన్‌), బెథెల్‌, బాంటన్‌, జాక్స్‌, సామ్‌ కర్రాన్‌, లియామ్‌ డాసన్‌, బేక్‌/ల్యూక్‌ ఉడ్‌, సకీబ్‌, ఆదిల్‌ రషీద్‌.

పిచ్‌, వాతావరణం

రివర్‌సైడ్‌ మైదానం బౌలర్లకు అనుకూలిస్తుంటుంది. ఇక్కడ టీ20 సగటు స్కోరు 138 మాత్రమే. మ్యాచ్‌ రోజు సాయంత్రం చిరు జల్లులకు ఆస్కారం ఉంది.

ఇవి కూడా చదవండి

అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం

ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్ రావు

Updated Date - Jul 01 , 2026 | 05:48 AM