ఫార్మాట్ మారింది.. ఆట మారేనా?
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:11 AM
టీ20 వరల్డ్‌కప్ చాంపియన్ హోదాలో ఆడిన రెండు సిరీ్‌సల్లోనూ వైట్‌వా్‌షకు గురైన టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలోనే జట్టు మూడు వన్డేలను ఆడబోతోంది..
మధ్యాహ్నం 3.30 నుంచి
సోనీ స్పోర్ట్స్‌లో..
జట్టులోకి విరాట్, బుమ్రా
నేటి నుంచి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్
తొలి విజయం కోసం భారత్
బర్మింగ్‌హామ్: టీ20 వరల్డ్‌కప్ చాంపియన్ హోదాలో ఆడిన రెండు సిరీ్‌సల్లోనూ వైట్‌వా్‌షకు గురైన టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలోనే జట్టు మూడు వన్డేలను ఆడబోతోంది. దీంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత్ ఈ సిరీ్‌సను తాజాగా ఆరంభించాలనుకుంటోంది. మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. అఫ్ఘాన్‌తో సిరీ్‌సకు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ బుమ్రా జట్టులో చేరారు. ఈ పర్యటనల్లో ఇప్పటివరకు జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో విజయమనేదే లేకపోవడంతో ఇంటా, బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వెటరన్లు రోహిత్-విరాట్ ద్వయం ఆట కీలకం కానుంది. అటు పొట్టి ఫార్మాట్‌లో సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసిన ఉత్సాహంలో ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్ తొలి వన్డేలోనూ తమదే పైచేయి కావాలనుకుంటోంది. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన చివరి ఐదు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించడం విశేషం.
జట్టు కూర్పు ఎలా?: టీ20ల్లో వరుస ఓటముల తర్వాత వన్డే బరిలో జట్టు కూర్పు ఎలా ఉండబోతున్నదనే చర్చ సాగుతోంది. ఓపెనర్లుగా గిల్, రోహిత్ ఖాయమే. ఇక రోహిత్‌కు ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో 65 సగటుతో ఉండడం సానుకూలాంశం కానుంది. వన్‌డౌన్‌లో రానున్న విరాట్, గత సెప్టెంబరు నుంచి వన్డేలు ఆడలేదు. అయితే ఈ సిరీస్ కోసం నెట్స్‌లో కఠిన ప్రాక్టీస్ సాగించాడు. శ్రేయాస్ తన కెప్టెన్సీలో విఫలమైనా టీ20ల్లో మెరుగ్గానే ఆడాడు. ఐదో నెంబర్‌లో రాహుల్ రానుండగా.. ఆ తర్వాత ఇషాన్, దూబేలలో ఒకరిని ఆడించే అవకాశం ఉంది. విరాట్ గైర్హాజరీలో అఫ్ఘాన్‌పై ఇషాన్ వన్‌డౌన్‌లో ఆకట్టుకున్నాడు. ఇక్కడి పిచ్‌లపై ఆరుగురు బ్యాటర్లు అవసరమనుకుంటే ఇషాన్‌ను ఆడించే అవకాశం ఉంది. మరోవైపు 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత బుమ్రా తొలిసారి ఈ ఫార్మాట్‌లో బంతి చేతపట్టనున్నాడు. అతడికి జతగా కొత్త పేసర్ గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ ఆడే అవకాశం ఉంది.
రూట్‌తో బలోపేతం: ఇంగ్లండ్ జట్టు ఈ ఏడాది ఎక్కువగా టీ20లు, టెస్టులనే ఆడింది. జనవరి 27న చివరి వన్డే ఆడిన బ్రూక్ సేన.. వీలైనంత త్వరగా టీ20 దృక్పఽథం నుంచి నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. జో రూట్ పునరాగమనంతో బ్యాటింగ్ మరింత బలోపేతమైంది. బట్లర్, బెథెల్, బ్రూక్ హిట్టింగ్ భారత బౌలర్లకు సవాల్ కానుంది. సౌథాంప్టన్‌లో జరిగిన చివరి టీ20లో బట్లర్-బ్రూక్ విధ్వంసం తెలిసిందే. బౌలింగ్‌లో పేసర్లు ఆర్చర్, టంగ్, కర్రాన్ కీలకం కానున్నారు.
తుది జట్లు
భారత్ (అంచనా): గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, దూబే/ఇషాన్, కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్/బ్రార్.
ఇంగ్లండ్: బెథెల్, డకెట్, జో రూట్, బ్రూక్ (కెప్టెన్), బట్లర్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, ఆర్చర్, డాసన్, టంగ్, ఆదిల్ రషీద్.
ఈ వార్తలనూ చదవండి:
హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..
ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..