Share News

లక్ష్యం.. క్లీన్‌స్వీప్

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:56 AM

సంపూర్ణ ఆధిపత్యంతో ఇప్పటికే సిరీ్‌సను చేజిక్కించుకున్న భారత్‌..అదే జోరుతో మూడో వన్డేనూ సొంతం చేసుకోవడం ద్వారా క్లీన్‌స్వీ్‌ప చేయాలని తహతహలాడుతోంది. ఈక్రమంలో...

లక్ష్యం.. క్లీన్‌స్వీప్

మ. 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

  • అఫ్ఘానిస్థాన్‌తో భారత్‌ మూడో వన్డే నేడు

  • కోలుకున్న నితీశ్‌.. అర్ష్‌దీ్‌పకు విశ్రాంతి?

చెన్నై: సంపూర్ణ ఆధిపత్యంతో ఇప్పటికే సిరీ్‌సను చేజిక్కించుకున్న భారత్‌..అదే జోరుతో మూడో వన్డేనూ సొంతం చేసుకోవడం ద్వారా క్లీన్‌స్వీ్‌ప చేయాలని తహతహలాడుతోంది. ఈక్రమంలో శనివారం ఇక్కడ జరిగే మూడో మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో రాహుల్‌తోపాటు యశస్వీ జైస్వాల్‌ భారీగా పరుగులు సాధించాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. గాయం నుంచి కోలుకొన్న నితీశ్‌ కుమార్‌ బరిలో దిగనున్నాడు. దీంతో అర్ష్‌దీప్‌కు విశ్రాంతినిచ్చే అవ కాశముంది. కాగా గాయంతో బెంగళూరులో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో పునరావాసం పూర్తి చేసుకున్న పేసర్‌ హర్షిత్‌ రాణాకు జట్టులో చోటు కల్పించారు. అతడు తుది 11 మందిలో ఆడే చాన్స్‌ మాత్రం లేదు. ఇక..సిరీస్‌ చేజార్చుకున్న అఫ్ఘానిస్థాన్‌ మూడో వన్డేలో గట్టి పోటీ ఇచ్చి భారత్‌ పర్యటనను ముగించాలని భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషభ్ పంత్?

భారత హెల్మెట్ ధరించి.. సెంచరీ బాదిన సంగక్కర!

Updated Date - Jun 20 , 2026 | 01:56 AM