Share News

శ్రీలంక చేరిన గిల్‌ సేన

ABN , Publish Date - Aug 05 , 2026 | 04:58 AM

రెండు టెస్టుల సిరీస్‌ కోసం శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని భారత క్రికెట్‌ జట్టు మంగళవారం శ్రీలంక పర్యటనకు వెళ్లింది...

శ్రీలంక చేరిన గిల్‌ సేన

జట్టుతో వెళ్లని సాయి సుదర్శన్‌

బెంగళూరు: రెండు టెస్టుల సిరీస్‌ కోసం శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని భారత క్రికెట్‌ జట్టు మంగళవారం శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అయితే జట్టులో చోటు దక్కించుకున్న టాపార్డర్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ మాత్రం ఈ బృందంలో లేడు. కాలి బొటనవేలి గాయంతో బాధపడుతున్న సాయి స్థానిక సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్సీ (సీఓఈ)లోనే కోలుకుంటున్నాడు. ‘సుదర్శన్‌ నెట్స్‌లో గంటపాటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయగలుగుతున్నాడు. మూడు, నాలుగు రోజుల్లో అతడి ఫిట్‌నె్‌సపై స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం’ అని సీఓఈ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈనెల 7 నుంచి భారత జట్టు మూడు రోజుల వామప్‌ మ్యాచ్‌ ఆడనుంంది. శ్రీలంకతో తొలి టెస్టు 15 నుంచి గాలె మైదానంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు సాయి అందుబాటులో లేకపోయినా, 23 నుంచి జరిగే రెండో టెస్టువరకల్లా అతడు జట్టుతో చేరగలడని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

రహానేకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు: సునీల్ గావస్కర్

Updated Date - Aug 05 , 2026 | 05:00 AM