‘వందేళ్ల’ సంబరం.. 40 రోజులు..12 మ్యాచ్‌లు
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:56 AM
సుదీర్ఘ ద్వైపాక్షిక మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటించనుంది. ఈ ఏడాది అక్టోబరు 22 నుంచి...
న్యూజిలాండ్‌లో సుదీర్ఘ పర్యటనకు టీమిండియా
ఆక్లాండ్: సుదీర్ఘ ద్వైపాక్షిక మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటించనుంది. ఈ ఏడాది అక్టోబరు 22 నుంచి డిసెంబరు ఒకటి వరకు జరిగే టూర్‌లో కివీస్‌తో భారత్ 5 టీ20లు, 5 వన్డేలతోపాటు 2 టెస్ట్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను న్యూజిలాండ్ క్రికెట్ బుధవారం విడుదల చేసింది. 40 రోజులపాటు సాగే 12 మ్యాచ్‌ల సిరీస్.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో సుదీర్ఘమైనది. ఇరుదేశాల మధ్య వందేళ్ల క్రీడా సంబంధాలకు మైలురాయిగా ఈ సిరీస్ నిలవనుంది.
ఇవి కూడా చదవండి:
బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..