టాప్‌లోనే భారత్ వన్డే ర్యాంకింగ్స్
ABN , Publish Date - May 12 , 2026 | 02:40 AM
ఐసీసీ వన్డే పురుషుల జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది....
దుబాయ్: ఐసీసీ వన్డే పురుషుల జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 118 పాయింట్లతో టీమిండియా టాప్‌లో నిలిచింది. సవరించిన తాజా వార్షిక ర్యాంకింగ్స్‌ను సోమవారం ప్రకటించారు. న్యూజిలాండ్ (113), ఆస్ట్రేలియా (109) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. పాకిస్థాన్ (98)ని వెనక్కి నెట్టిన దక్షిణాఫ్రికా (102) నాలుగో ర్యాంక్ కైవసం చేసుకుంది. శ్రీలంక (96), అఫ్ఘానిస్థాన్ (93), ఇంగ్లండ్ (89) తదుపరి స్థానాలలో నిలిచాయి.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?
భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్