న్యూజిలాండ్ ‘ఎ’కు ఆధిక్యం
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:49 AM
టెస్ట్ సిరీస్ సన్నద్ధతలో ఉన్న పేసర్ సిరాజ్ (4/118) కీలక వికెట్లతో చెలరేగినా.. లోయరార్డర్ పోరాడడంతో న్యూజిలాండ్ ‘ఎ’ 78 పరుగుల ఆధిక్యాన్ని...
భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్ 32/0
క్రైస్ట్‌చర్చ్: టెస్ట్ సిరీస్ సన్నద్ధతలో ఉన్న పేసర్ సిరాజ్ (4/118) కీలక వికెట్లతో చెలరేగినా.. లోయరార్డర్ పోరాడడంతో న్యూజిలాండ్ ‘ఎ’ 78 పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసింది. భారత్ ‘ఎ’తో రెండో అనధికార టెస్టులో ఆటకు మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 218/3తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కివీస్ ‘ఎ’ 424 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్ (5/87) ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి సెషన్‌లో విజృంభించిన సిరాజ్.. మాథ్యూ బాయ్‌లె (110), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (93), బ్రెట్ రాండెల్ (5)ను అవుట్ చేయగా.. మిచెల్ హె (31)ను ముకేశ్ వెనక్కిపంపడంతో న్యూజిలాండ్ 291/7తో నిలిచింది. అయితే, క్రిస్టియన్ క్లార్క్ (41), ఫ్రేజర్ (40), జారోడ్ మెక్‌కె (33), జేడన్ లెనాక్స్ (33 నాటౌట్) ప్రతిఘటించడంతో కివీస్ స్కోరు 400 మార్క్ దాటింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 32/0 స్కోరు చేసింది. సోమవారం ఆట ఆఖరుకు ఓపెనర్లు జైస్వాల్ (20), సాయి సుదర్శన్ (11) క్రీజులో ఉన్నారు. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ‘ఎ’ ఇంకా 46 పరుగులు వెనుకబడింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 346 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్ గెలిచిన ఆనందంలో పాక్.. షాకిచ్చిన ఐసీసీ!
ఐర్లాండ్‌పై నమీబియా చరిత్రాత్మక విజయం..
అభిషేక్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్..