సెమీస్ చేరాలంటే.. చివరి రెండు నెగ్గాల్సిందే
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:27 AM
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి..టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలను బాగా దెబ్బ తీసింది. మరోవైపు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో సఫారీ జట్టు తమ రౌండ్-4 చాన్సును సజీవంగా...
టీ20 ప్రపంచకప్‌లో నేడు
న్యూజిలాండ్ Xస్కాట్లాండ్ (మ. 3 నుంచి)
శ్రీలంక X ఐర్లాండ్ (రా. 7 నుంచి)
ఆస్ట్రేలియా X పాకిస్థాన్ (రా. 11 నుంచి)
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి..టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలను బాగా దెబ్బ తీసింది. మరోవైపు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో సఫారీ జట్టు తమ రౌండ్-4 చాన్సును సజీవంగా ఉంచుకొంది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో కూడిన ఆరు జట్ల గ్రూప్ ‘ఎ’ నుంచి రెండు టీమ్‌లే సెమీ్‌సకు అడుగు వేస్తాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో సఫారీ జట్టు పరాజయం పాలైంది. ఇప్పుడిక హర్మన్‌ప్రీత్ సేన సెమీఫైనల్ అవకాశాలు మిగిలిన రెండు గ్రూపు మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడ్డాయి. ఈనెల 25న బంగ్లాదేశ్‌తో, 28న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో టీమిండియా గెలిస్తేనే సెమీ్‌సకు చేరుతుంది. అయితే దక్షిణాఫ్రికా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గినా..ఆ జట్టు నెట్ రన్‌రేట్ (-0.546) కంటే హర్మన్‌సేన రన్‌రేట్ (2.511) ఎక్కువగా ఉంది. అందువల్ల రెండు మ్యాచ్‌లు గెలిచినా సఫారీలకు చాన్సు లేదు. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఒకటి ఓడితే..బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌లతో దక్షిణాఫ్రికా ఆడే మ్యాచ్‌ల ఫలితాలపై మన సెమీస్ చాన్సు ఆధారపడి ఉంటుంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో సఫారీలు గెలిచి.. భారత్ ఒక మ్యాచ్‌లోనే నెగ్గితే అప్పుడు పాయింట్ల ఆధారంగా సఫారీలు ముందంజ వేస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
లఖ్‌నవూ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..