Share News

కుప్పకూలారు

ABN , Publish Date - Jul 08 , 2026 | 02:23 AM

టీ20 వరల్డ్‌ చాంపియన్‌ భారత్‌ ప్రదర్శన మ్యాచ్‌ మ్యాచ్‌కూ మరింత తీసికట్టుగా మారుతోంది. ఇప్పటికే పసికూన ఐర్లాండ్‌ చేతిలో సిరీస్‌ కోల్పోగా.. ఇంగ్లండ్‌ చేతిలో వరుసగా రెండో ఓటమిని....

కుప్పకూలారు

  • 76కే భారత్‌ ఆలౌట్‌

  • 125 రన్స్‌తో ఓడిన శ్రేయాస్‌ సేన

  • ఇంగ్లండ్‌దే మూడో టీ20

నాటింగ్‌హామ్‌: టీ20 వరల్డ్‌ చాంపియన్‌ భారత్‌ ప్రదర్శన మ్యాచ్‌ మ్యాచ్‌కూ మరింత తీసికట్టుగా మారుతోంది. ఇప్పటికే పసికూన ఐర్లాండ్‌ చేతిలో సిరీస్‌ కోల్పోగా.. ఇంగ్లండ్‌ చేతిలో వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొంది. 202 పరుగుల ఛేదనలో పేసర్లు జోష్‌ టంగ్‌ (4/28), ఆర్చర్‌ (3/29) పదునైన బంతుల ధాటికి మన బ్యాటర్లు కనీసం వంద పరుగులు కూడా చేయలేక చతికిలపడ్డారు. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తమ టీ20 చరిత్రలోనే అతి పెద్ద ఓటమిని (125 పరుగుల తేడా) చవిచూడాల్సి వచ్చింది. అటు సిరీ్‌సలో ఆతిథ్య జట్టు 2-0తో ఆధిక్యం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 201/7 స్కోరు సాధించింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70), జోస్‌ బట్లర్‌ (21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36), సామ్‌ కర్రాన్‌ (24 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్‌) రాణించారు. పేసర్లు ప్రిన్స్‌, హర్షిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్‌ 11.4 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. వైభవ్‌ (13), ఇషాన్‌ (13) టాప్‌ స్కోరర్లు. రషీద్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఆర్చర్‌ నిలిచాడు.


వికెట్లు టపటపా: భారీ ఛేదనలో భారత్‌ ఏ దశలోనూ పోరాడలేకపోయింది. పేసర్లు ఆర్చర్‌, టంగ్‌ల ధాటికి బ్యాటింగ్‌ ఆర్డర్‌ కకావికలమైంది. ప్రతీ బ్యాటర్‌ హిట్టింగ్‌ కోసం వెళ్లి వికెట్లను చేజార్చుకున్నారు. పవర్‌ప్లే ముగిసేలోపే అభిషేక్‌ (10), వైభవ్‌, ఇషాన్‌, శ్రేయాస్‌ (5), అక్షర్‌ (10) వికెట్లను కోల్పోయిన భారత జట్టు 52/5 స్కోరుతో దీనంగా కనిపించింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం ఆగలేదు. మిగతా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమై పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా కనీసం వంద పరుగులు కూడా చేయలేకపోయింది.

ముందు బట్లర్‌.. ఆ తర్వాత సాల్ట్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. అయితే ఆరంభంలో మాత్రం మరో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ హవా సాగింది. చివర్లో సామ్‌ కర్రాన్‌ అండగా నిలిచి స్కోరు 200 దాటించాడు. పేసర్‌ అర్ష్‌దీప్‌ తొలి ఓవర్‌నే మెయిడిన్‌గా వేసినా.. అటు బట్లర్‌ మాత్రం బౌండరీలతో జోరు చూపాడు. అయితే అతడి ధాటికి ఆరో ఓవర్‌లో పేసర్‌ ప్రిన్స్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో తొలి వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే కెప్టెన్‌ బ్రూక్‌ (16)ను సైతం తనే అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ తడబడినట్టు కనిపించింది. ఈదశలో సాల్ట్‌ బ్యాట్‌కు పనిచెబుతూ స్పిన్నర్‌ వరుణ్‌ ఓవర్‌లో 6,4,4తో 18 రన్స్‌ రాబట్టాడు. అయితే 12వ ఓవర్‌లో పేసర్‌ హర్షిత్‌ వరుస బంతుల్లో బెథెల్‌ (13), బాన్‌టన్‌ (0)లను అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ 111/4 స్కోరుతో నిలిచింది. అటు 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న సాల్ట్‌.. అర్ష్‌దీప్‌ ఓవర్‌లో 6,4తో మరింత వేగం పెంచాడు. అతను మరింత ప్రమాదకరంగా మారకముందే 17వ ఓవర్‌లో స్పిన్నర్‌ అక్షర్‌ అవుట్‌ చేశాడు. దీంతో ఐదో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ అదే ఓవర్‌లో జాక్స్‌ (14) రెండు సిక్సర్లతో వేగం తగ్గకుండా చూశాడు. మరో వైపు కర్రాన్‌ అడపాదడపా బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఆరో వికెట్‌కు ఈ ఇద్దరు 35 పరుగులు జోడించారు. చివరి ఓవర్‌లో అర్ష్‌దీప్‌ 9 పరుగులే ఇచ్చినా జట్టు స్కోరు 200 దాటింది.


స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌: సాల్ట్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) అక్షర్‌ 70, బట్లర్‌ (బి) ప్రిన్స్‌ యాదవ్‌ 36, బ్రూక్‌ (సి) అభిషేక్‌ (బి) ప్రిన్స్‌ యాదవ్‌ 16, బెథెల్‌ (సి) వైభవ్‌ (బి) హర్షిత్‌ 13, బాంటన్‌ (సి) వరుణ్‌ (బి) హర్షిత్‌ 0, సామ్‌ కర్రాన్‌ (నాటౌట్‌) 41, విల్‌ జాక్స్‌ (రనౌట్‌) 14, ఆర్చర్‌ (రనౌట్‌) 5, డాసన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 201/7; వికెట్ల పతనం: 1-43, 2-71, 3-111, 4-111, 5-158, 6-193, 7-199; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-1-36-0, హర్షిత్‌ రాణా 4-0-40-2, అక్షర్‌ పటేల్‌ 4-0-49-1, ప్రిన్స్‌ యాదవ్‌ 4-0-30-2, శివమ్‌ దూబే 1-0-10-0, వరుణ్‌ చక్రవర్తి 3-0-35-0.

భారత్‌: అభిషేక్‌ (సి) సాల్ట్‌ (బి) టంగ్‌ 10, వైభవ్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 13, ఇషాన్‌ (సి) బెథెల్‌ (బి) టంగ్‌ 13, శ్రేయాస్‌ (సి) బెథెల్‌ (బి) ఆర్చర్‌ 5, అక్షర్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 10, తిలక్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) జాక్స్‌ 3, హర్షిత్‌ (సి) బాంటన్‌ (బి) టంగ్‌ 9, దూబే (సి) బట్లర్‌ (బి) టంగ్‌ 2, అర్ష్‌దీప్‌ (సి) బట్లర్‌ (బి) రషీద్‌ 4, వరుణ్‌ (బి) రషీద్‌ 5, ప్రిన్స్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 11.4 ఓవర్లలో 76 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-23, 2-29, 3-41, 4-41, 5-52, 6-60, 7-63, 8-68, 9-70, 10-76; బౌలింగ్‌: ఆర్చర్‌ 3-0-29-3, టంగ్‌ 4-0-28-4, జాక్స్‌ 2-0-5-1, రషీద్‌ 2.4-0-14-2.

ఇవి కూడా చదవండి:

45వ పడిలోకి ‘తలా’.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!

తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!

Updated Date - Jul 08 , 2026 | 02:23 AM