వైభవ్‌పై ఐఐఎం ఇండోర్ అధ్యయనం
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:12 AM
క్రికెట్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్ల ప్రాయంలోనే ఇంతటి పరిణతి ఎలా అబ్బింది? భారీ అంచనాల కారణంగా నెలకొనే తీవ్ర ఒత్తిడిని..
న్యూఢిల్లీ: క్రికెట్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్ల ప్రాయంలోనే ఇంతటి పరిణతి ఎలా అబ్బింది? భారీ అంచనాల కారణంగా నెలకొనే తీవ్ర ఒత్తిడిని, సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని ఎలా అధిగమించగలుగుతున్నాడు? ఇవన్నీ వైభవ్ ఈడు పిల్లలకు తెలిస్తే.. అవన్నీ వారి భవిష్యత్తుకు మార్గదర్శకాలు అవుతాయి కదా! అందుకే.. వైభవ్‌పై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఇండోర్ ప్రత్యేక అధ్యయనం చేపట్టాలని నిర్ణయించింది. వండర్ కిడ్స్‌పై ఒత్తిడి ప్రభావం ఎంత మేరకు ఉంటుం ది? దాన్ని వారు ఎలా అధిగమిస్తారు? డబ్బు, పేరు ప్రఖ్యాతుల వెల్లువను ఎలా తట్టుకొని నిలబడతారు? అనేవీ విశ్లేషిస్తారు.
ఇవి కూడా చదవండి:
జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్!
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట