డే టెస్టుల్లోనూ గులాబీ బంతి
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:51 AM
ఆధునిక క్రికెట్‌ను మరింత ఆకర్షణీయం గా మార్చేందుకు సవరించిన నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి...
అమల్లోకి ఐసీసీ కొత్త రూల్స్
దుబాయ్: ఆధునిక క్రికెట్‌ను మరింత ఆకర్షణీయం గా మార్చేందుకు సవరించిన నిబంధనలు గురువారం నుంచి అమల్లో కి రానున్నట్టు ఐసీసీ ప్రకటించింది. ఇందులో భాగంగా డే/నైట్ టెస్టుల్లో మాత్రమే ఉపయోగిస్తున్న గులాబీ బంతులను ఇకనుంచీ ప్రయోగాత్మకంగా డే టెస్టుల్లోనూ వినియోగించవచ్చు. అలాగే నిర్దేశించిన సమయంలోగా బ్యాటర్ బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోతే రెండుసార్లు అంపైర్లు హెచ్చరిస్తారు. ఆ తర్వాత ప్రతీ వార్నింగ్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు. మరోవైపు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల డ్రింక్స్ విరామ సమయాల్లో ప్రధాన కోచ్ లేదా తన ప్రతినిధి మైదానంలోకి వచ్చే వీలుంది.
ఈ వార్తలు కూడా చదవండి
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు
రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..