హర్షిత్ శతక మోత
ABN , Publish Date - Jun 25 , 2026 | 05:09 AM
ఓపెనర్ హర్షిత్ చౌధరి (62 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 121 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో ...
వరంగల్ వారియర్స్ విజయం
హైదరాబాద్: ఓపెనర్ హర్షిత్ చౌధరి (62 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 121 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో టీజీ టీ20 లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ ఐదు వికెట్ల విజయం అందుకుంది. మ్యాచ్‌లో తొలుత అన్విత ఖమ్మం ఏసెస్ 19.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ గుప్తా (54), మికిల్ జైస్వాల్ (54) హాఫ్ సెంచరీలు చేశారు. అబ్దుల్ మాలిక్, మురుగున్ అభిషేక్ చెరో 3, క్రాంతి 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో వరంగల్ 18.5 ఓవర్లలో 208/5 స్కోరు చేసి నెగ్గింది. రిషికేత్ (27) మోస్తరుగా ఆడాడు. సాకేత్ 2వికెట్లు సాధించాడు.
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!