Share News

ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌ వైదొలగాలి

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:01 AM

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ నుంచి హార్దిక్‌ పాండ్యా వైదొలగాలని భారత జట్టు మాజీ ఓపెనర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌...

ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌ వైదొలగాలి

  • కృష్ణమాచారి శ్రీకాంత్‌

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ నుంచి హార్దిక్‌ పాండ్యా వైదొలగాలని భారత జట్టు మాజీ ఓపెనర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ సూచించాడు. ముంబై ఫ్రాంచైజీలో నెలకొన్న ఆధిపత్య పోరుకు తెర దించాలంటే వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్నాడు. రోహిత్‌ను పక్కనబెట్టినప్పటి నుంచి ముంబై జట్టులో అంతర్గత పోరు నెలకొందని శ్రీకాంత్‌ అన్నాడు. గుజరాత్‌ను హార్దిక్‌ ఐపీఎల్‌ విజేతగా నిలిపినా.. ప్రస్తుతం వరల్డ్‌కప్‌ సాధించిన సూర్య అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాడని శ్రీకాంత్‌ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..

మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Updated Date - Mar 24 , 2026 | 06:01 AM