Share News

రూ. 12 కోట్ల కారులో చాలీసా..

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:59 AM

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా లైఫ్‌స్టైల్‌ ఎంతో విభిన్నంగా ఉంటుంది. విలాసవంతమైన కార్లు, టాటూలు, ఆహార్యంతో...

రూ. 12 కోట్ల కారులో చాలీసా..

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా లైఫ్‌స్టైల్‌ ఎంతో విభిన్నంగా ఉంటుంది. విలాసవంతమైన కార్లు, టాటూలు, ఆహార్యంతో అలా్ట్ర మోడ్రన్‌గా కనిపిస్తాడు. పాండ్యా ఇటీవలే రూ. 12 కోట్ల విలువైన ఫెరారీ కారును కొన్నాడు. అలాంటి లగ్జరీ కారులో పాండ్యా పాప్‌ మ్యూజిక్‌ వింటూ ప్రయాణిస్తాడని అందరూ భావిస్తారు. కానీ, ఫెరారీ కారులో కూడా తాను ఎక్కువగా వినేది ‘హనుమాన్‌ చాలీసా’ అని తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని హార్దిక్‌ బయటపెట్టాడు. చాలీసా వింటుంటే తనలో సానుకూల శక్తి పెరుగుతుందని చెప్పాడు. ఏపాట విన్నా కూడా తనకు అలాంటి అనుభూతి కలగదన్నాడు.

ఇవి కూడా చదవండి

పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..

మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Updated Date - Mar 24 , 2026 | 05:59 AM