Share News

టెస్ట్‌ జట్టులో బ్రార్‌

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:45 AM

పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌ను న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టులో చేర్చారు. ఈ విషయాన్ని...

టెస్ట్‌ జట్టులో బ్రార్‌

కుల్దీప్‌ విడుదల

వెల్లింగ్టన్‌: పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌ను న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టులో చేర్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం వెల్లడించింది. ఇక..స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను జట్టు నుంచి విడుదలజేస్తున్నట్టు తెలిపింది. అతడు స్వదేశం వచ్చేసి దేశవాళీ పోటీలలో ఆడతాడని వెల్లడించింది. టెస్ట్‌ జట్టుకు ఎంపిక కావడంతో ఆదివారం కివీస్‌తో జరిగే ఐదో, చివరి వన్డేలో బ్రార్‌ ఆడడంలేదు. కాగా..కీపర్‌ పంత్‌ టెస్ట్‌ జట్టుతో కలిసినట్టు బోర్డు తెలిపింది. భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఈనెల 19 నుంచి ఇక్కడ జరిగే మొదటి టెస్ట్‌తో ప్రారంభమవుతుంది.

టెస్ట్‌లకు భారత జట్టు: గిల్‌ (కెప్టెన్‌), జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ (వైస్‌-కెప్టెన్‌), దేవ్‌దత్‌ పడిక్కళ్‌, పంత్‌, జురెల్‌, జడేజా, అన్షుల్‌ కాంబోజ్‌, బుమ్రా, ప్రసిద్ధ్‌, ఆకాశ్‌ దీప్‌, సాయి సుదర్శన్‌, నితీశ్‌ కుమార్‌, సుందర్‌, సిరాజ్‌, బ్రార్‌.

ఈ వార్తలనూ చదవండి:

జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్

ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..

Updated Date - Nov 15 , 2026 | 04:45 AM