గంభీర్‌నే టార్గెట్ చేస్తే ఎలా..
ABN , Publish Date - Aug 06 , 2026 | 04:04 AM
ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీ్‌సలు కోల్పోవడంతో కోచ్ గంభీర్‌పై ఒత్తిడి పెరిగింది. పైగా..ఈసారి టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ ఆడే అవకాశాలు డోలాయమానంలో పడ్డాయి..
ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీ్‌సలు కోల్పోవడంతో కోచ్ గంభీర్‌పై ఒత్తిడి పెరిగింది. పైగా..ఈసారి టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ ఆడే అవకాశాలు డోలాయమానంలో పడ్డాయి. దాంతో శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్ గెలవడం టీమిండియాకు అవశ్యం. ఒకవేళ ఈ సిరీస్ భారత్ నెగ్గకపోతే గంభీర్ పదవికీ ఎసరు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈనేపథ్యంలో గంభీర్‌కు మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ అండగా నిలిచాడు. ‘శ్రీలంకతో సిరీస్ కీలకమే. ఒకవేళ గంభీర్ విఫలమైతే అతడినే ఎందుకు తప్పుబట్టాలి. జట్టు బాధ్యత కూడా ఉంటుంది’ అని స్పష్టంజేశాడు. మరో భారత మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ కూడా గంభీర్‌కు వెన్నుగా నిలిచాడు. ‘కోచ్‌గా ఎత్తుపల్లాలు ఉంటాయి. ముఖ్యంగా జట్టు పునర్‌నిర్మాణంలో ఇవి సహజమే. అందువల్ల కోచ్‌గా కుదురుకొనేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలి’ అని అన్నాడు.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ