Share News

ఫేక్‌ వీడియోలపై హైకోర్టుకు..

ABN , Publish Date - Mar 20 , 2026 | 06:16 AM

కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించి, తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారంటూ భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ గౌతం గంభీర్‌ కోర్టును...

ఫేక్‌ వీడియోలపై హైకోర్టుకు..

గంభీర్‌ పిటిషన్‌

న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించి, తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారంటూ భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ గౌతం గంభీర్‌ కోర్టును ఆశ్రయించాడు. ఆన్‌లైన్‌లో తన పేరు, ముఖం, గొంతును సైతం ఉపయోగించి నకిలీ వీడియోలు, అనధికారిక కంటెంట్‌ పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తంచేశాడు. దీనిపై 16 మందిని ప్రతివాదులుగా పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టులో గంభీర్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. నకిలీ వీడియోలను తక్షణమే తొలగించేందుకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, రూ.2.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు. తను ప్రధాన కోచ్‌ పదవికి రాజీనామా చేసినట్టు, సీనియర్‌ ఆటగాళ్లపై అసభ్యకరంగా మాట్లాడినట్టు సోషల్‌ మీడియాలో గంభీర్‌ ఫేక్‌ వీడియోలు చక్కర్లు కొడుతుండగా.. వీటికి లక్షల్లో వ్యూస్‌ ఉండడం గమనార్హం.

ఇవి కూడా చదవండి..

భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..

మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..

Updated Date - Mar 20 , 2026 | 06:16 AM