ఫైనల్లో ఇంగ్లండ్
ABN , Publish Date - Jul 04 , 2026 | 05:11 AM
కెప్టెన్ నాట్ షివర్ బ్రంట్ (47 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75) సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో మహిళల టీ20 ప్రపంచక్‌పలో ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో సెమీఫైనల్లో...
ఆస్ట్రేలియాతో టైటిల్‌పోరు రేపు
సెమీ్‌సలో సఫారీలకు నిరాశ
మహిళల టీ20 ప్రపంచకప్
లండన్: కెప్టెన్ నాట్ షివర్ బ్రంట్ (47 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75) సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో మహిళల టీ20 ప్రపంచక్‌పలో ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 40 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి.. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే టైటిల్‌ఫైట్‌కు సిద్ధమైంది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఆరంభంలోనే 23/3తో ఇంగ్లండ్ కష్టాల్లో పడిన దశలో.. మాజీ సారథి హీథర్ నైట్ (58) జతగా బ్రంట్ నాలుగో వికెట్‌కు 133 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించి జట్టును ఆదుకుంది. షబ్నిమ్ ఇస్మాయిల్, మ్లాబా చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (51) మినహా అంతా విఫలమవడంతో సఫారీలు 20 ఓవర్లలో 129/8 స్కోరుకే పరిమితమై ఓడారు. లారెన్ బెల్, చార్లీ డీన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న బ్రంట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.
ఈ వార్తలనూ చదవండి:
వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు
సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..