Share News

మూడో టీ20లోనూ మహిళల ఓటమి

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:58 AM

అలైస్‌ క్యాప్సీ (43 బంతుల్లో 82), హీథర్‌నైట్‌ (42 బంతుల్లో 70 నాటౌట్‌) ధనాధన్‌ హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటడంతో భారత్‌తో ఆఖరి టీ20లో ఇంగ్లండ్‌...

మూడో టీ20లోనూ మహిళల ఓటమి

2-1తో సిరీస్‌ ఇంగ్లండ్‌ కైవసం

టాంటన్‌ (యూకే): అలైస్‌ క్యాప్సీ (43 బంతుల్లో 82), హీథర్‌నైట్‌ (42 బంతుల్లో 70 నాటౌట్‌) ధనాధన్‌ హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటడంతో భారత్‌తో ఆఖరి టీ20లో ఇంగ్లండ్‌ ఆరు వికెట్లతో విజయం అందుకుంది.. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను ఆతిథ్య జట్టు 2-1తో సొంతం చేసుకుంది. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 180/5 స్కోరు సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (56 నాటౌట్‌), యాస్తికా భాటియా (32), దీప్తీశర్మ (32) మాత్రమే రాణించారు. లారెన్‌ బెల్‌ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం ఇంగ్లండ్‌ 18.3 ఓవర్లలో 184/4 స్కోరు చేసి నెగ్గింది. క్యాప్సీ, హీథర్‌నైట్‌ నాలుగో వికెట్‌కు 137 పరుగులు జోడించారు. అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 01:58 AM