భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్ వన్డే జట్టు ఇదే
ABN , Publish Date - Jul 04 , 2026 | 05:14 AM
ప్రస్తుతం భారత్‌తో టీ20లు ఆడుతున్న ఆతిథ్య ఇంగ్లండ్.. వన్డే సిరీ్‌సలో తలపడే తమ జట్టును శుక్రవారం ప్రకటించింది....
లండన్: ప్రస్తుతం భారత్‌తో టీ20లు ఆడుతున్న ఆతిథ్య ఇంగ్లండ్.. వన్డే సిరీ్‌సలో తలపడే తమ జట్టును శుక్రవారం ప్రకటించింది. 16 మంది సభ్యుల ఈ బృందానికి హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇక, దాదాపు ఏడాది తర్వాత స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జట్టులోకి రాగా.. అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్, ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్‌లకు చోటు దక్కింది. ఐదు టీ20 సిరీస్ ముగియగానే.. ఈనెల 14 (బర్మింగ్‌హామ్), 16 (కార్డిఫ్), 19 (లార్డ్స్)న జరిగే మూడు వన్డేల్లో ఇరుజట్లు తలపడతాయి.
ఇంగ్లండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), బాంటన్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, జో రూట్, డకెట్, బట్లర్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, రేహన్ అహ్మద్, ఆర్చర్, అట్కిన్సన్, కోల్స్, సామ్ కర్రాన్, లియామ్ డాసన్, సకీబ్ మహమూద్, రషీద్, టంగ్.
ఈ వార్తలనూ చదవండి:
వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు
సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..