బెంగళూరు కాదు..చెన్నై
ABN , Publish Date - Aug 21 , 2026 | 02:48 AM
దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను బెంగళూరులోకాక చెన్నైలో నిర్వహించనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా వెల్లడించాడు..
దులీప్ ట్రోఫీ ఫైనల్ వేదిక మార్పు
న్యూఢిల్లీ: దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను బెంగళూరులోకాక చెన్నైలో నిర్వహించనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా వెల్లడించాడు. ట్రోఫీ తొలి 2 రౌండ్లు సహా తుదిపోరును బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఏ)లో జరపాలని తొలుత నిర్ణయించారు. అయితే సీఓఏలో ఫ్యాన్స్ మ్యాచ్‌ను తిలకించే అవకాశంలేదు. దాంతో మ్యాచ్‌ను అభిమానులు ప్రత్యక్షంగా చూసేందుకు చెన్నైకి మార్చినట్టు సైకియా వివరించాడు. 2026-27 సీజన్ దులీప్ ట్రోఫీ ఈనెల 23న ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి:
పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్
బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు