Share News

కూపర్‌ భారీ సెంచరీ

ABN , Publish Date - Jun 15 , 2026 | 05:51 AM

ఓపెనర్‌ కూపర్‌ కనోలి (149) శతకంతో ఆదుకోవడంతో.. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా వైట్‌వాష్‌ను తప్పించుకొంది...

కూపర్‌ భారీ సెంచరీ

మూడో వన్డేలో బంగ్లాపై ఆసీస్‌ గెలుపు

6 వికెట్లతో వణికించిన షోరిఫుల్‌

ఢాకా: ఓపెనర్‌ కూపర్‌ కనోలి (149) శతకంతో ఆదుకోవడంతో.. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా వైట్‌వాష్‌ను తప్పించుకొంది. 0-2తో ఇప్పటికే సిరీస్‌ చేజార్చుకొన్న ఆస్ట్రేలియా.. ఆదివారం హోరాహోరీగా సాగిన మూడో, ఆఖరి మ్యాచ్‌లో వికెట్‌ తేడాతో బంగ్లాపై నెగ్గింది. తొలుత బంగ్లా 50 ఓవర్లలో 274/5 స్కోరు చేసింది. తౌహిద్‌ హిద్రోయ్‌ (84), లిటన్‌ దాస్‌ (58)తోపాటు ముస్సాదిక్‌ హొస్సేన్‌ (56 నాటౌట్‌) అర్ధ శతకాలు నమోదు చేశారు. బ్రాట్‌లెట్‌, రెన్‌షా చెరో 2 వికెట్లు పడగొట్టారు. షోరిపుల్‌ ఇస్లాం 6 వికెట్లతో విజృంభించినా.. ఛేదనలో ఆసీస్‌ 49.3 ఓవర్లలో 277/9 స్కోరు చేసి గెలిచింది. లబుషేన్‌ (29), కామెరూన్‌ గ్రీన్‌ (27) ఫర్వాలేదనిపించారు.

ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

Updated Date - Jun 15 , 2026 | 05:51 AM