ఏపీఎల్ విజేత భీమవరం బుల్స్
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:39 AM
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5 టైటిల్‌ను భీమవరం బుల్స్ గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో...
ఫైనల్లో వైజాగ్ చిత్తు
మంగళగిరి సిటీ (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5 టైటిల్‌ను భీమవరం బుల్స్ గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో భీమవరం జట్టు 10 వికెట్లతో సింహాద్రి వైజాగ్ లయన్స్‌ను చిత్తుగా ఓడించి విజేతగా నిలిచింది. మొదట వైజాగ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. విజయ్ (39) మినహా అంతా విఫలమయ్యారు. 3 వికెట్లు తీసిన రవితేజ సహా ఇతర బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వైజాగ్ బ్యాటర్ల వెన్ను విరిచారు. ఛేదనలో ఓపెనర్లు రేవంత్ రెడ్డి (71), హేమంత్ రెడ్డి (59) అర్ధ శతకాలతో సత్తా చాటడంతో భీమవరం ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే 9 ఓవర్లలోనే 140 రన్స్ చేసి గెలిచింది. ఏపీ మంత్రి నారా లోకేశ్ విజేత జట్టుకు ట్రోఫీని ప్రదానం చేశారు.
ఇవి కూడా చదవండి
అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం
ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్ రావు