నైట్‌క్లబ్‌లో స్టోక్స్ గొడవ
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:48 AM
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు గెలిచాక అట్కిన్సన్‌తో కలిసి స్టోక్స్...
కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం!
లండన్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు గెలిచాక అట్కిన్సన్‌తో కలిసి స్టోక్స్ సోమవారం తెల్లవారుజాము వరకు నైట్‌క్లబ్‌లో గడిపాడు. అక్కడ ఫుల్లుగా తాగి ఓ రగ్బీ ఆటగాడితో గొడవపడడం వివాదంగా మారింది. వాస్తవానికి సిరీస్ మధ్యలో ఆటగాళ్లు నైట్‌క్లబ్‌లకు వెళ్లకూడదని ఇంగ్లండ్ బోర్డు ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించింది. అయినా, ఈ ఇద్దరు క్రికెటర్లు నిబంధనలు అతిక్రమించడంతో ఇప్పటికే బోర్డు విచారణ చేపట్టింది. ఈ వివాదం నేపథ్యంలో స్టోక్స్ స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో పాటు ఏకంగా కెరీర్‌కు గుడ్‌బై ప్రకటించే అవకాశముందని ఇంగ్లిష్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2017లో కూడా స్టోక్స్ ఇలాంటి గొడవలోనే ఇరుక్కున్నాడు.
ఇవి కూడా చదవండి:
ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?
ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!