Share News

ఫ్రాంచైజీ యజమానులకు బీసీసీఐ హెచ్చరికలు!

ABN , Publish Date - May 12 , 2026 | 02:42 AM

ఐపీఎల్‌ మ్యాచ్‌ల సమయంలో ఫ్రాంచైజీ యజమానుల తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మ్యాచ్‌ డే ప్రొటోకాల్‌ను...

ఫ్రాంచైజీ యజమానులకు బీసీసీఐ హెచ్చరికలు!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ మ్యాచ్‌ల సమయంలో ఫ్రాంచైజీ యజమానుల తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మ్యాచ్‌ డే ప్రొటోకాల్‌ను జట్ల యాజమాన్యాలు పాటించలేదంటూ అవినీతి నిరోధక విభాగం ఇచ్చిన నివేదికతో బోర్డు అప్రమత్తమైంది. కొందరు యజమానులు మ్యాచ్‌ సమయంలో ఆటగాళ్లను సంప్రదించడం, నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏకంగా డగౌట్‌లోకి కూడా వస్తున్నారు. ఇంతకుముందే హెచ్చరికలు చేసినా.. వాటిని పట్టించుకోకపోవడంతో యజమానుల కదలికలను ఇకనుంచి నిశితంగా పరిశీలిస్తామని ఆయా జట్లను బీసీసీఐ గట్టిగా హెచ్చరించిందని సమాచారం.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?

భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

Updated Date - May 12 , 2026 | 02:42 AM