Share News

చాంపియన్లకు రూ. 131 కోట్లు

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:34 AM

టీ20 ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచిన భారత క్రికెట్‌ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. నగదు బహుమతిగా రూ. 131 కోట్లు టీమిండియాకు...

చాంపియన్లకు రూ. 131 కోట్లు

టీ20 కప్‌ విజేతకు బీసీసీఐ భారీ నజరానా

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచిన భారత క్రికెట్‌ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. నగదు బహుమతిగా రూ. 131 కోట్లు టీమిండియాకు అందజేయనున్నట్టు మంగళవారం తెలిపింది. రెండేళ్ల క్రితం ఇదే టోర్నమెంట్‌లో విజేతగా నిలిచినప్పుడు రోహిత్‌ సేనకు రూ. 125 కోట్లు రివార్డుగా ప్రకటించిన భారత క్రికెట్‌ బోర్డు.. ఆ మొత్తాన్ని ఈసారి మరో రూ. 6 కోట్లకు పెంచింది. కాగా, ఈ నగదును 15 మంది ఆటగాళ్లలో ఒక్కొక్కరికి సుమారు రూ. 6 కోట్ల చొప్పున.. మిగతా రూ. 41 కోట్లను సహాయ సిబ్బందికి పంచుతారని సమాచారం. ఇక, టీ20 కప్‌ నెగ్గినందుకు భారత క్రికెట్‌ జట్టుకు ఐసీసీ నుంచి ఇప్పటికే రూ. 27.48 కోట్లు ప్రైజ్‌మనీగా లభించిన సంగతి తెలిసిందే. రన్నరప్‌ న్యూజిలాండ్‌కు రూ. 14.65 కోట్లు దక్కాయి.

ఇవి కూడా చదవండి:

చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!

డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ

Updated Date - Mar 11 , 2026 | 03:34 AM