Share News

బంగ్లాలో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం ఎత్తివేత

ABN , Publish Date - Mar 29 , 2026 | 03:05 AM

ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధాన్ని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఎత్తి వేసింది. మెగా లీగ్‌ ప్రసారాలకు ఎలాంటి అడ్డంకి లేదని కొత్త ప్రభుత్వంలోని...

బంగ్లాలో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం ఎత్తివేత

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధాన్ని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఎత్తి వేసింది. మెగా లీగ్‌ ప్రసారాలకు ఎలాంటి అడ్డంకి లేదని కొత్త ప్రభుత్వంలోని సమాచార శాఖ మంత్రి జహీరుద్దీన్‌ స్వపన్‌ తెలిపారు. క్రీడలను, రాజకీయాలను ముడిపెట్ట కూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో మన దేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో బంగ్లా పేసర్‌ ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించడంతో భారత్‌, బంగ్లా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో అప్పటి మహమ్మద్‌ యూనిస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 29 , 2026 | 03:05 AM