Share News

ఫైనల్లో ఆసీస్‌ అమ్మాయిలు

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:46 AM

అజేయ ఆటతీరుతో దూసుకెళుతున్న ఆస్ట్రేలియా మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం వెస్టిండీ్‌సతో జరిగిన ఏకపక్ష సెమీ్‌సలో ఆసీస్‌ 8 వికెట్లతో...

ఫైనల్లో ఆసీస్‌ అమ్మాయిలు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో నేడు

రెండో సెమీఫైనల్‌ (రా. 11 నుంచి)

దక్షిణాఫ్రికా X ఇంగ్లండ్‌ (స్టార్‌స్పోర్ట్స్‌లో)

వెస్టిండీస్‌పై ఘనవిజయం

లండన్‌: అజేయ ఆటతీరుతో దూసుకెళుతున్న ఆస్ట్రేలియా మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం వెస్టిండీ్‌సతో జరిగిన ఏకపక్ష సెమీ్‌సలో ఆసీస్‌ 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. తాజా టోర్నీలో ఆసీ్‌సకిది వరుసగా ఆరో విజయం కాగా.. ఓవరాల్‌గా ఈ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టడం ఎనిమిదోసారి. ముందుగా విండీస్‌ 20 ఓవర్లలో 125/7 స్కోరు సాధించింది. హేలీ మాథ్యూస్‌ (30), డాటిన్‌ (26), క్యాంప్‌బెల్‌ (22) రాణించారు. గార్డ్‌నర్‌, వేర్‌హామ్‌, మోలినెక్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఆసీస్‌ 13 ఓవర్లలో 127/2 స్కోరుతో గెలిచింది. బెత్‌ మూనీ (61 నాటౌట్‌), గార్డ్‌నర్‌ (35 నాటౌట్‌) చెలరేగారు.

ఇవి కూడా చదవండి

అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం

ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్ రావు

Updated Date - Jul 01 , 2026 | 05:46 AM