Share News

ఆసీస్‌ 10 వికెట్ల గెలుపు

ABN , Publish Date - Mar 09 , 2026 | 02:08 AM

ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టు మూడు రోజుల్లోనే ముగియగా.. భారత మహిళల జట్టుకు 10 వికెట్ల తేడాతో ఘోరపరాభవం ఎదురైంది. దీంతో ఈ మల్టీ ఫార్మాట్‌...

ఆసీస్‌ 10 వికెట్ల గెలుపు

పెర్త్‌: ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టు మూడు రోజుల్లోనే ముగియగా.. భారత మహిళల జట్టుకు 10 వికెట్ల తేడాతో ఘోరపరాభవం ఎదురైంది. దీంతో ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీ్‌సను 12-4 తేడాతో ఆసీస్‌ దక్కించుకుంది. ఆదివారం 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ 4.3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులతో ముగించింది. అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌటైంది. ప్రతీకా రావల్‌ (63), స్నేహ్‌ రాణా (30) రాణించారు. హామిల్టన్‌కు మూడు.. గార్డ్‌నర్‌, సదర్లాండ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 323, భారత్‌ 198 పరుగులు చేశాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తో పాటు ‘సిరీస్‌’ కూడా సదర్లాండ్‌కు దక్కింది.

ఇవి కూడా చదవండి:

254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

Updated Date - Mar 09 , 2026 | 02:08 AM