Share News

నేనే నెంబర్‌ 1

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:49 AM

అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ఆంధ్ర యువ స్పిన్నర్‌ శ్రీచరణి అరుదైన ఘనత సాధించింది. తాజా ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో...

నేనే నెంబర్‌ 1

తెలుగమ్మాయి శ్రీచరణికి టాప్‌ ర్యాంక్‌

మహిళల టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ఆంధ్ర యువ స్పిన్నర్‌ శ్రీచరణి అరుదైన ఘనత సాధించింది. తాజా ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె 753 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇంగ్లండ్‌కు చెందిన చార్లీ డీన్‌, లిన్సే స్మిత్‌ ఆ తర్వాతిస్థానాల్లో ఉన్నారు. టాప్‌-10లో మరో భారత బౌలర్‌ దీప్తి శర్మ (8) మాత్రమే ఉంది. గతేడాది జూన్‌లో ఇంగ్లండ్‌పై పొట్టి ఫార్మాట్‌లో 22 ఏళ్ల శ్రీచరణి అరంగేట్రం చేసింది. అద్భుత బౌలింగ్‌ ప్రతిభతో ఏడాది తిరిగేలోపే అగ్రశ్రేణి బౌలర్‌గా పేరు తెచ్చుకోగలిగింది. ప్రస్తుత టీ20 వరల్డ్‌క్‌పలోనూ శ్రీచరణి మూడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

Updated Date - Jun 24 , 2026 | 05:49 AM