మరో ఏడాది పొడిగించరూ..
ABN , Publish Date - Mar 20 , 2026 | 06:09 AM
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించాల్సిందిగా బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. 2027 అక్టోబరు-నవంబరుల్లో జరిగే...
బీసీసీఐకి అగార్కర్ వినతి
న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించాల్సిందిగా బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. 2027 అక్టోబరు-నవంబరుల్లో జరిగే వన్డే వరల్డ్‌కప్ వరకు తనకు అవకాశం కల్పించాలని కోరాడట. జూలై 2023లో అగార్కర్ చైర్మన్‌గా నియ మితుడయ్యాడు. 2024లో టీ20 వరల్డ్‌కప్, 2025లో చాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంతో బహుమతిగా ఓ సంవత్సరంపాటు...అంటే ఈ ఏడాది జూన్ వరకు పదవీకాలాన్ని బీసీసీఐ పొడిగించింది. తాజాగా పొట్టిక్‌పను మరోసారి గెల్చుకున్న నేపథ్యంలో ఇంకో ఏడాదిపాటు చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగే చాన్స్ ఇవ్వాలని కోరినట్టు చెబుతున్నారు. వెస్ట్‌జోన్‌కు చెందిన మరో భారత మాజీ క్రికెటర్ కూడా సెలెక్షన్ కమిటీ చైర్మన్ పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..
మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..