Share News

CM Cup Telangana: రూరల్‌ టు గ్లోబల్‌

ABN , Publish Date - Jan 08 , 2026 | 05:49 AM

సీఎం కప్‌ ఆటల పోటీల పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. రూరల్‌ టు గ్లోబల్‌ నినాదంతో చాంపియన్లను...

CM Cup Telangana: రూరల్‌ టు గ్లోబల్‌

17 నుంచి సీఎం కప్‌ పోటీలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సీఎం కప్‌ ఆటల పోటీల పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. రూరల్‌ టు గ్లోబల్‌ నినాదంతో చాంపియన్లను తయా రు చేయాలన్న లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి శ్రీహరి, శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, క్రీడల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు, శాట్‌ వీసీ-ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు. ఈనెల 17 నుంచి గ్రామస్థాయి, 28 నుంచి మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీస్థాయి, 10నుంచి జిల్లా, 19 నుంచి రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి:

కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్

కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్

Updated Date - Jan 08 , 2026 | 05:49 AM