Share News

ఆర్చరీలో చికిత, ధీరజ్‌ సత్తా

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:57 AM

జాతీయ సీనియర్‌ ఆర్చరీ పోటీల్లో తానిపర్తి చికిత (పెద్దపల్లి), బొమ్మదేవర ధీరజ్‌ (విజయవాడ) అదరగొట్టారు...

ఆర్చరీలో చికిత, ధీరజ్‌ సత్తా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సీనియర్‌ ఆర్చరీ పోటీల్లో తానిపర్తి చికిత (పెద్దపల్లి), బొమ్మదేవర ధీరజ్‌ (విజయవాడ) అదరగొట్టారు. మంగళవారం షిల్లాంగ్‌లో జరిగిన ఈ పోటీల్లో చికిత, ధీరజ్‌ చెరో మూడు పతకాలు సాధించారు. చికిత వ్యక్తిగత ఒలింపిక్‌ రౌండ్‌లో స్వర్ణం, 50 మీటర్ల విభాగంలో కాంస్యం, మిక్స్‌డ్‌ విభాగంలో భువన్‌ సాకేత్‌ (హైదరాబాద్‌)తో కలిసి కాంస్యం దక్కించుకుంది. పురుషుల వ్యక్తిగత రికర్వ్‌ కేటగిరీలో ధీరజ్‌ 70 మీ. పోటీలో పసిడి, ఒలింపిక్‌ రౌండ్‌లో రజతం సాధించాడు. టీమ్‌ ఈవెంట్‌లో సర్వీసెస్‌ తరఫున ధీరజ్‌, సుఖ్‌చైన్‌, భాగవత్‌, రాహుల్‌ బృందం రజతం నెగ్గింది.

ఇవి కూడా చదవండి:

అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్

ఐపీఎల్ 2027: ఎల్ఎస్‌జీతో ట్రేడ్ డీల్.. రాజస్థాన్ రాయల్స్‌కు షమీ

Updated Date - Nov 18 , 2026 | 05:57 AM