Share News

ఈసారి..రజత కాంస్యాలతో సరి

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:41 AM

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషులు రజతం, మహిళలు కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.. ఆదివారం జరిగిన 11వ, ఆఖరి రౌండ్‌ను హంగేరీతో పురుషుల జట్టు డ్రాగా ముగించింది. దాంతో మొత్తం 18 పాయింట్లతో భారత్‌, జర్మనీ సమంగా...

ఈసారి..రజత కాంస్యాలతో సరి

భారత పురుషుల జట్టుకు రెండోస్థానం

మహిళల బృందానికి మూడో స్థానం

చెస్‌ ఒలింపియాడ్‌

సమర్‌ఖండ్‌ (ఉజ్బెకిస్థాన్‌): చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషులు రజతం, మహిళలు కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.. ఆదివారం జరిగిన 11వ, ఆఖరి రౌండ్‌ను హంగేరీతో పురుషుల జట్టు డ్రాగా ముగించింది. దాంతో మొత్తం 18 పాయింట్లతో భారత్‌, జర్మనీ సమంగా నిలిచాయి. అయితే టై బ్రేక్‌ స్కోరు ఆధారంగా మనోళ్లకు రజత పతకం దక్కిం ది. జర్మనీ కాంస్యంతో సరిపెట్టుకుంది. ఆతిథ్య ఉజ్బెకిస్థాన్‌ స్వర్ణం గెలుపొందింది. మహిళల విభాగం ఆఖరి రౌండ్‌లో జార్జియాతో భారత్‌ డ్రా చేసింది. మొత్తం 17 పాయింట్లతో మన మహిళలు కాంస్య పతకంతో టోర్నీని ముగించారు. చైనా (20) స్వర్ణం, కజకిస్థాన్‌ (18) రజత పతకం అందుకున్నాయి. గత చెస్‌ ఒలింపియాడ్‌ (2024)లో భారత పురుషులు, మహిళల జట్లు పసిడి పతకాలు సాధించడం గమనార్హం.

సవితకు స్వర్ణం: టోర్నీలో అద్భుతంగా రాణించిన సవితా శ్రీకి వ్యక్తిగత స్వర్ణ పతకం లభించింది. దివ్యా దేశ్‌ముఖ్‌ రజత పతకం చేజిక్కించుకోగా, కోనేరు హంపి, వంతిక అగర్వాల్‌ కాంస్య పతకాలు అందుకున్నారు. పురుషుల్లో..గుకే్‌షకు రజతం, ప్రజ్ఞానంద కాంస్య పతకం చేజిక్కించుకున్నారు.

ఆ కప్‌ మూడోసారీ మనదే

ఇక..ఓపెన్‌, మహిళల విభాగాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచినందుకు భారత్‌ ప్రతిష్ఠాత్మక నొనా గాప్రిందాష్విలి కప్‌ గెలుచుకుంది. ఈ ట్రోఫీ భారత్‌ దక్కించుకోవడం వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం. 2022 (చెన్నై), 2024 (బుడాపెస్ట్‌) చెస్‌ ఒలింపియాడ్‌లలోనూ ఈ కప్‌ లభించడం మన సత్తాకు నిదర్శనం.

ఈ వార్తలూ చదవండి

ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక

నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే

Updated Date - Sep 28 , 2026 | 05:41 AM