Share News

పురుషులు, మహిళల జోరు

ABN , Publish Date - Sep 20 , 2026 | 05:25 AM

డిఫెండింగ్‌ చాంపియన్లు భారత పురుషులు, మహిళలు జట్లు చెస్‌ ఒలింపియాడ్‌లో జోరు కొనసాగిస్తున్నాయి....

పురుషులు, మహిళల జోరు

చెస్‌ ఒలింపియాడ్‌

సమర్‌ఖండ్‌ (ఉజ్బెకిస్థాన్‌): డిఫెండింగ్‌ చాంపియన్లు భారత పురుషులు, మహిళలు జట్లు చెస్‌ ఒలింపియాడ్‌లో జోరు కొనసాగిస్తున్నాయి. వరుసగా నాలుగో రౌండ్‌లోనూ రెండు జట్లు గెలిచాయి. శనివారం జరిగిన పోరులో పురుషుల జట్టు 3-1తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. అర్జున్‌, గుకేష్‌ తమ గేమ్‌లు నెగ్గగా.. ప్రజ్ఞానంద, నిహాల్‌ తమ గేమ్‌లు డ్రాగా ముగించారు. మహిళల జట్టు కూడా 3-1తో మంగోలియాపై గెలిచింది. సావిత్రి శ్రీ, దివ్యా దేశ్‌ముఖ్‌ విజయాలు దక్కించుకోగా.. కోనేరు హంపి, వైశాలీ ప్రత్యర్థులతో పాయింట్‌ పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 05:25 AM