Share News

ట్రాన్స్‌జెండర్లపై నిషేధమా?

ABN , Publish Date - Mar 30 , 2026 | 01:31 AM

ఒలింపిక్స్‌లో పోటీపడకుండా ట్రాన్స్‌జెండర్‌ అథ్లెట్లను నిషేధించడాన్ని రెండుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ రన్నర్‌ కాస్టెర్‌ సెమెన్యా...

ట్రాన్స్‌జెండర్లపై నిషేధమా?

ఐఓసీ చీఫ్‌పై సెమన్యా విమర్శలు

కేప్‌టౌన్‌ : ఒలింపిక్స్‌లో పోటీపడకుండా ట్రాన్స్‌జెండర్‌ అథ్లెట్లను నిషేధించడాన్ని రెండుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ రన్నర్‌ కాస్టెర్‌ సెమెన్యా (దక్షిణాఫ్రికా) తప్పుపట్టింది. ఈమేరకు సహచర ఆఫ్రికన్‌, ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీపై విమర్శలు గుప్పించింది. ‘ఐఓసీ నిర్ణయంవల్ల ఆఫ్రికా మహిళలు ఎంతగా నష్టపోతారో నాకు తెలుసు. అలాగే ఆఫ్రికా మహిళగా కోవెంట్రీ కూడా తెలుసు. జన్యువులను మనం నియంత్రించలేమని ఆమెకు తెలియదా’ అని సెమెన్యా నిలదీసింది. జింబాబ్వేకు చెందిన మాజీ స్విమ్మర్‌ కోవెంట్రీ గత ఏడాది ఐఓసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే. కాగా..ఒలింపిక్స్‌ ఇతర ఐఓసీ పోటీలలో ట్రాన్స్‌జెండర్‌ మహిళా అథ్లెట్లు..మహిళల విభాగాలలో బరిలో దిగడాన్ని నిషేధిస్తూ మూడు రోజుల కిందట నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!

ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్

Updated Date - Mar 30 , 2026 | 01:31 AM