Share News

అల్కారజ్‌కు షాక్‌

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:13 AM

స్పెయిన్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కారజ్‌లేని గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ను ఊహించగలమా? గాయంతోనో, మరేదైనా కారణంతోనే అతడు పాల్గొనలేకపోతే తప్ప.. ఏ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఫైట్‌లోనైనా..

అల్కారజ్‌కు షాక్‌

సెమీస్ లో టియఫో, రిబకినా షెల్టన్‌ సంచలనం

క్వార్టర్స్‌లోనే చాంపియన్‌ అవుట్‌

న్యూయార్క్‌: స్పెయిన్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కారజ్‌లేని గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ను ఊహించగలమా? గాయంతోనో, మరేదైనా కారణంతోనే అతడు పాల్గొనలేకపోతే తప్ప.. ఏ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఫైట్‌లోనైనా సరే 23 ఏళ్ల అల్కారజ్‌ ఉండి తీరాల్సిందే. కారణం.. అతడి ఆట అలాంటిది. అలాంటి కింగ్‌ కార్లోస్‌కు అమెరికా యువ సంచలనం బెన్‌ షెల్టన్‌ షాకిచ్చాడు. యూఎస్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన కార్లోస్‌ అల్కారజ్‌ జోరుకు బ్రేక్‌ వేశాడు. ఐదు సెట్ల హోరాహోరీ క్వార్టర్‌ఫైనల్లో రెండో సీడ్‌ అల్కారజ్‌కు 23 ఏళ్ల షెల్టన్‌ షాకిచ్చాడు. బుధవారం జరిగిన 4.30 గంటల మారథాన్‌ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ షెల్టన్‌ 6-7 (7), 6-1, 6-3, 1-6, 7-6 (10)తో అల్కారజ్‌ను ఇంటిబాట పట్టించాడు. దాంతో కార్లోస్‌ 18 మ్యాచ్‌ల వరుస విజయాలకు చెక్‌ పడింది. శనివారం జరిగే సెమీఫైనల్లో అమెరికాకే చెందిన ఫ్రాన్సిస్‌ టియఫోతో షెల్టన్‌ అమీతుమీ తేల్చుకుంటాడు. మరో ఐదు సెట్ల హోరాహోరీ క్వార్టర్స్‌లో 11వ సీడ్‌ టియఫో 5-3, 3-6, 7-5, 6-3, 7-6 (6)తో అలెక్స్‌ మిచెల్సన్‌ (అమెరికా)ను ఓడించాడు. దీంతో ఫైనల్లో అమెరికా ఆటగాడు ఒకరు ఉండడం ఖాయమైంది. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ ఎలెనా రిబకినా (కజకిస్థాన్‌), మూడో సీడ్‌ జెస్సిక పెగుల (అమెరికా) సెమీఫైనల్లో అడుగుపెట్టారు. క్వార్టర్‌ఫైనల్లో రిబకినా 3-6, 6-1, 6-4తో చైనా స్టార్‌ కిన్వెన్‌ జెంగ్‌పై, మూడో సీడ్‌ పెగుల (అమెరికా) 3-6, 6-4, 6-3తో 26వ సీడ్‌ ఎమ్మా నవారో (అమెరికా)పై కష్టపడి నెగ్గారు. ఆండ్రీవా, గాఫ్‌ మధ్య జరిగే క్వార్టర్స్‌ విజేతతో రిబకినా సెమీస్‌ ఆడనుంది. మరో సెమీస్‌లో టాప్‌ సీడ్‌ సబలెంకను పెగుల ఢీకొననుంది.

ఇవి కూడా చదవండి..

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..

మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

Updated Date - Sep 10 , 2026 | 05:13 AM