Share News

‘లారెస్‌’ విజేతలు అల్కారజ్‌, సబలెంక

ABN , Publish Date - Apr 22 , 2026 | 02:57 AM

ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్‌ స్టార్లు కార్లోస్‌ అల్కారజ్‌, ఎరీనా సబలెంకలకు ప్రతిష్ఠాత్మక లారెస్‌ వార్షిక అవార్డులు...

‘లారెస్‌’ విజేతలు అల్కారజ్‌, సబలెంక

న్యూఢిల్లీ: ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్‌ స్టార్లు కార్లోస్‌ అల్కారజ్‌, ఎరీనా సబలెంకలకు ప్రతిష్ఠాత్మక లారెస్‌ వార్షిక అవార్డులు దక్కాయి. అలాగే పారిస్‌ సెయింట్‌ జెర్మైన్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారం గెలుచుకుంది. గతేడాది అల్కారజ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌, యూఎస్‌ ఓపెన్‌లతో పాటు ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఈ ప్రదర్శనకు గాను లారెస్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గెల్చుకున్నాడు. అలాగే మహిళల వరల్డ్‌ నెంబర్‌ సబలెంక వరుసగా రెండోసారి యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలవడంతో స్పోర్ట్స్‌ ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు దక్కింది. రుమేనియాకు చెందిన మాజీ జిమ్నాస్ట్‌ నాడియా కొమనేసికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!

కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్

Updated Date - Apr 22 , 2026 | 02:57 AM