Share News

Ashes 2026 Sixth Test: రాణించిన బ్రూక్‌, రూట్‌

ABN , Publish Date - Jan 05 , 2026 | 06:07 AM

హ్యారీ బ్రూక్‌ (78 బ్యాటింగ్‌), జో రూట్‌ (72 బ్యాటింగ్‌) అర్ధ శతకాలతో సత్తా చాటడంతో యాషెస్‌ ఐదో టెస్ట్‌లో తొలిరోజును ఇంగ్లండ్‌ ప్రశంసనీయంగా ముగించింది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత...

Ashes 2026 Sixth Test: రాణించిన బ్రూక్‌, రూట్‌

ఇంగ్లండ్‌ 211/3

యాషెస్‌ ఐదో టెస్ట్‌

సిడ్నీ : హ్యారీ బ్రూక్‌ (78 బ్యాటింగ్‌), జో రూట్‌ (72 బ్యాటింగ్‌) అర్ధ శతకాలతో సత్తా చాటడంతో యాషెస్‌ ఐదో టెస్ట్‌లో తొలిరోజును ఇంగ్లండ్‌ ప్రశంసనీయంగా ముగించింది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే డకెట్‌ (27), క్రాలీ (16), బెతెల్‌ (10) విఫలం కావడంతో 57/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో బాధ్యతాయుతంగా ఆడిన రూట్‌, బ్రూక్‌ నాలుగో వికెట్‌కు అభేద్యంగా 154 పరుగులు జోడించారు. దాంతో వర్షం, వెలుతురు లేమి కారణంగా ఆట నిలిపి వేసేసరికి పర్యాటక జట్టు మూడు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

మ్యాచ్‌కు భారీ భద్రత

మూడు వారాల కిందట ఇక్కడి బోండి బీచ్‌లో ఉగ్రవాదులు దాడి చేసి 15 మందిని పొట్టన బెట్టుకున్న నేపథ్యంలో సిడ్నీ టెస్ట్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రైఫిళ్లు ధరించిన పోలీసులు, అశ్విక దళంతోపాటు అల్లర్ల నిరోధక బృందం సభ్యులు డేగ కళ్లతో పహారా కాశారు. ఉగ్రవాదుల కాల్పులకు బలైన వారికి ఆటగాళ్లు మ్యాచ్‌ ప్రారంభానికి ముం దు నివాళి అర్పించాయి. ఇక..కాల్పులకు తెగబడిన వ్యక్తినుంచి తుపాకీని లాక్కుని పలువురి ప్రాణాలను కాపాడిన అల్‌ అహ్మద్‌ను మైదానంలోకి ఆహ్వానించగా, ఫ్యాన్స్‌ లేచి నిల్చొని చప్పట్లతో అభినందించారు.

138 ఏళ్లలో తొలిసారి..

ఈ టెస్ట్‌కు ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్‌ కూడా లేకుండా బరిలో దిగడం ద్వారా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. సిడ్నీ క్రికెట్‌ మైదానంలో 1888 తర్వాత ప్రత్యేక స్పిన్నర్‌ లేకుండా ఆసీస్‌ జట్టు టెస్ట్‌ ఆడడం ఇదే తొలిసారి. టాడ్‌ మర్ఫీకి కాకుండా ఆల్‌రౌండర్‌ బ్యూ వెబ్‌స్టర్‌కు కంగారూలు తుది జట్టులో స్థానం కల్పించారు.

ఇవి కూడా చదవండి:

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్

T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు!

Updated Date - Jan 05 , 2026 | 06:07 AM