Share News

బ్రిస్బేన్‌ ఒలింపిక్స్‌ చిహ్నమిదే

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:25 AM

బ్రిస్బేన్‌ నగరం 2032 ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రీడల చిహ్నాలను నిర్వాహకులు సోమవారం లాంఛనంగా...

బ్రిస్బేన్‌ ఒలింపిక్స్‌ చిహ్నమిదే

బ్రిస్బేన్‌: బ్రిస్బేన్‌ నగరం 2032 ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రీడల చిహ్నాలను నిర్వాహకులు సోమవారం లాంఛనంగా ఆవిష్కరించారు. ఆస్ట్రేలియాలోని అరుదైన జాతి పక్షి గులాబీ రంగు ‘కాకాటు’ను ఒలింపిక్స్‌ చిహ్నంగా ఎంపిక చేశారు. ఈ చిహ్నంలో కాకాటు పక్షి శిరస్సు ఉంటుంది. ఆ పక్షి రంగును ఒలింపిక్‌, పారాలింపిక్‌ జ్వాలను తలపించేలా రూపొందించారు. దాని ఆకారం ఆతిథ్య రాష్ట్రం క్వీన్స్‌ల్యాండ్‌ను ప్రతిబింబిస్తున్నది. ఇక పారాలింపిక్స్‌కు పసుపు రంగు శిరస్సును కలిగిన కాకాటూను ఎంపిక చేశారు. వాస్తవంగా ఈ చిహ్నాలను మూడు రోజుల తర్వాత నిర్వాహకులు విడుదలజేయాలనుకున్నారు. కానీ పొరపాటున దానిని వారు తమ అధికారిక యూట్యూబ్‌ చానెల్‌లో అప్‌లోడ్‌ చేశారు. దాంతో హడావుడిగా సోమవారంనాడు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 05:25 AM