బ్రెజిల్ కథ అదే వ్యథ
ABN , Publish Date - Jul 07 , 2026 | 06:06 AM
హాట్ ఫేవరెట్ బ్రెజిల్ కల చెదిరింది. ఆరోసారి ప్రపంచ విజేతగా నిలవాలన్న సాంబా జట్టుకు ఈసారీ చుక్కెదురైంది. హాలాండ్ డబుల్ స్ట్రయిక్‌తో స్రాంబా జట్టును చిత్తుచేసిన నార్వే.. తొలిసారి క్వార్టర్స్...
ఫిఫా కప్ మ్యాచ్‌లు
ప్రీక్వార్టర్స్
అర్జెంటీనా X ఈజిప్టు
(రాత్రి 9.30)
స్విట్జర్లాండ్ X కొలంబియా
(నేటి అర్ధరాత్రి 1.30)
క్వార్టర్స్‌కు నార్వే ఫ నిష్క్రమించిన సాంబా జట్టు
హాట్ ఫేవరెట్ బ్రెజిల్ కల చెదిరింది. ఆరోసారి ప్రపంచ విజేతగా నిలవాలన్న సాంబా జట్టుకు ఈసారీ చుక్కెదురైంది. హాలాండ్ డబుల్ స్ట్రయిక్‌తో స్రాంబా జట్టును చిత్తుచేసిన నార్వే.. తొలిసారి క్వార్టర్స్ బెర్త్ పట్టేసి చరిత్ర సృష్టించింది. ఇక, మ్యాచ్‌లో ఓ గోల్ కొట్టి అలరించిన బ్రెజిల్ స్టార్ నెమార్.. జట్టు ఓటమితో తీవ్ర భావోద్వేగానికి గురై ఏకంగా ఆటకు వీడ్కోలు పలకడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. మరో థ్రిల్లింగ్ ఫైట్‌లో ఆతిథ్య మెక్సికోపై నెగ్గిన ఇంగ్లండ్ సెమీ్‌సలో
చోటు కోసం నార్వేను ఢీకొనేందుకు సిద్ధమైంది.
ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ (యూఎస్): చివరి నిమిషాల్లో ఎర్లింగ్ హాలాండ్ మెరుపు దాడులతో.. బ్రెజిల్ వరల్డ్‌కప్ కలల సౌధం కుప్పకూలింది. సోమవారం జరిగిన రౌండ్-16 మ్యాచ్‌లో బ్రెజిల్ 1-2తో నార్వే చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో డబుల్ ధమాకాతో విజృంభించిన హాలాండ్ (79వ, 90వ నిమిషం).. మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి నార్వేను క్వార్టర్స్ చేర్చి సూపర్ హీరో అయిపోయాడు. అంతిమ క్షణాల్లో నెమార్ (90+10వ) పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచినా.. అప్పటికే సాంబా జట్టు ఓటమి ఖరారైంది. నార్వే గెలుపులో గోల్ కీపర్ ఓర్జన్ నైలాండ్ కూడా కీలకపాత్ర పోషించాడు. ప్రత్యర్థి స్పాట్ కిక్‌తోపాటు దాదాపు నాలుగు ప్రయత్నాలను అడ్డుకొన్నాడు.
స్పాట్ కిక్ మిస్..: మ్యాచ్‌లో బ్రెజిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా.. నార్వే గట్టిపోటీ ఇవ్వడంతో పోరు ఆసక్తిగా మారింది. ఆరంభం నుంచి ఇరుజట్లూ బంతిపై ఆధిపత్యం కోసం పోరాడాయి. కానీ, సాంబా టీమ్‌కు ముందుగానే పైచేయి సాధించే అవకాశం పెనాల్టీ రూపంలో వచ్చింది. 14వ నిమిషంలో కున్హాను పెనాల్టీ ఏరియాలో మొరటుగా అడ్డుకొన్నారు. సమీక్షించిన రెఫరీ బ్రెజిల్‌కు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. కానీ, బ్రూనో గుమరెజ్ కొట్టిన కిక్‌ను నైలాండ్ అద్భుతంగా అడ్డుకొన్నాడు. ఇక్కడ నుంచి బ్రెజిల్ ఆట గాడితప్పగా.. నార్వే పుంజుకొంది. కానీ, ఫస్టా్‌ఫలో ఇరుజట్లూ ఖాతా తెరవలేక పోయాయి. ఇక, సెకండా్‌ఫలో సాంబా టీమ్ జోరు పెంచింది. కానీ, ఫినిషింగ్ లోపాలతోపాటు నార్వే కీపర్‌ను బోల్తా కొట్టించలేక పోయారు. ఈ క్రమంలో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారి తీస్తుందా? అనే అనుమానం కలిగింది. కానీ, 79వ నిమిషంలో హాలాండ్ సూపర్ ఫినిషింగ్ గోల్‌తో బ్రెజిల్‌కు షాకిచ్చాడు. ఆండ్రెస్ క్రాస్‌ను ఎర్లింగ్ హెడర్‌తో గోల్‌లోకి పంపి నార్వేను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. అయితే, మరో నాలుగు నిమిషాల తర్వాత బ్రెజిల్ ప్లేయర్ ఎన్‌డ్రిక్స్ షాట్‌ను కీపర్ నైలాండ్ నెట్టేసి గోల్ కాకుండా అడ్డుకొన్నాడు. ఇక, 90వ నిమిషంలో పాస్‌ను అందుకొన్న హాలాండ్.. బాక్స్ బయట నుంచి డిఫెండర్లను తప్పిస్తూ కొట్టిన కిక్ నేరుగా గోల్‌లో పడడంతో నార్వే 2-0తో మ్యాచ్‌పై పట్టు బిగించింది. స్టాపేజ్ టైమ్‌లో ఫౌల్ కారణంగా లభించిన పెనాల్టీని నెమార్ గోల్‌గా మలచినా.. అప్పటికే పరిస్థితి చేజారింది.
ఘనా ఫుట్‌బాల్ కోచ్ రాజీనామా
కన్సాస్ సిటీ: ఘనా ఫుట్‌బాల్ జట్టు ప్రధాన కోచ్ కార్లోస్ క్విరోజ్ రాజీనామా చేశాడు. ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌క్‌పలో జట్టు గ్రూప్ దశను దాటినప్పటికీ.. రౌండ్ ఆఫ్ 32లో కొలంబియా చేతిలో ఓడింది. 73 ఏళ్ల కార్లోస్ గత ఏప్రిల్‌లోనే కోచ్ బాధ్యతలు తీసుకున్నాడు. గతంలో ఇరాన్, పోర్చుగల్, ఈజిప్టు జట్లకు కోచ్‌గా వ్యవహరించిన కార్లో్‌సకు ఇది వరుసగా ఐదో వరల్డ్‌కప్ కావడం విశేషం.
7
ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన ఎర్లింగ్ హాలాండ్.. మొత్తం ఏడు గోల్స్‌తో మెస్సీ, ఎంబాపెతో సమంగా గోల్డెన్ బూట్ రేసులో నిలిచాడు.
1
ఓవరాల్‌గా నాలుగోసారి వరల్డ్‌క్‌పఆడుతోన్న నార్వే.. ఈ టోర్నీలో క్వార్టర్స్ చేరడం ఇదే మొదటిసారి.
ప్రపంచకప్‌లో బ్రెజిల్ క్వార్టర్స్‌కు చేరకుండా వెనుదిరగడం 1990 తర్వాత ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ
ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు