Share News

National Senior Boxing Championship: బాక్సర్లకు చేదు అనుభవం

ABN , Publish Date - Jan 05 , 2026 | 06:11 AM

జాతీయ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో సత్తా చాటేందుకు ఎంతో ఉత్సుకతతో వేదిక వద్దకు చేరుకున్న బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం నుంచి నోయిడాలో జరగాల్సిన బాక్సింగ్‌ పోటీలు..

National Senior Boxing Championship: బాక్సర్లకు చేదు అనుభవం

అభాసుపాలైన బీఎఫ్ఐ

నిఖత్‌తో సహా పలువురు స్టార్ల బౌట్లు వాయిదా

గ్రేటర్‌ నోయిడా: జాతీయ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో సత్తా చాటేందుకు ఎంతో ఉత్సుకతతో వేదిక వద్దకు చేరుకున్న బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం నుంచి నోయిడాలో జరగాల్సిన బాక్సింగ్‌ పోటీలు షెడ్యూల్‌ ప్రకారం మధ్యా హ్నం రెండుగంటలకు ప్రారంభమవ్వాల్సి ఉండగా, సా యంత్రం 6.30 వరకు మొదలు కాకపోవడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. నిఖత్‌జరీన్‌ సహా పలువురి బౌట్లు సోమవారానికి వాయిదా పడ్డాయి. జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య అసమర్థతతో పోటీల నిర్వహణ అభాసుపాలైంది. తొలి రోజు మూడు రింగ్‌ల్లో 42 పురుషుల, 38 మహిళల బౌట్లు జరగాల్సి ఉండగా, ఒక్కటే రింగ్‌ ఏర్పాటు చేయడంతో బాక్సర్లు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత పురుషుల బౌట్లు ప్రారంభమైనా మహిళల బౌట్ల గురించి నిర్వాహకులను ఎన్నిసార్లు అడిగినా సరైన సమాచారం లేకపోవడంతో రాత్రి 8 గంటల వరకు వేచి చూసి బాక్సర్లు తిరిగి వెళ్లారు. దీనిపై బాక్సింగ్‌ సమాఖ్య స్పంది స్తూ రవాణా ఇబ్బందుల కారణంగా సమయానికి ఏర్పా ట్లు చేయలేకపోయామని తెలిపింది. అయితే, ఈ టోర్నీకి స్పాన్సర్లు లేకపోవడంతో నిధుల కొరతతో ఏర్పాట్లు సమయానికి చేయలేకపోయారని తెలుస్తోంది. ఇక, పురుషుల బౌట్లలో 52 కిలోల విభాగంలో అమిత్‌ పంఘల్‌, సాగర్‌, లాల్‌రామ్‌ బట్‌ శుభారంభం చేశారు.

ఇవి కూడా చదవండి:

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్

T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు!

Updated Date - Jan 05 , 2026 | 06:11 AM