ఐపీఎల్ వేలంలోకి బెన్ స్టోక్స్
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:38 AM
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ మినీ వేలానికి అందుబాటులో ఉండనున్నాడు. అతడితో పాటు 12 మంది బంగ్లాదేశ్ క్రికెటర్లు...
12 మంది బంగ్లా క్రికెటర్లు కూడా..
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ మినీ వేలానికి అందుబాటులో ఉండనున్నాడు. అతడితో పాటు 12 మంది బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ముస్తాఫిజుర్ రహ్మాన్, షకీబ్ అల్ హసన్ మాత్రం ఈ వేలానికి దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టోక్స్ కనీస ధర రూ.2 కోట్లు. 2023లో అతను చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. వాస్తవానికి గతేడాది జరిగిన మెగా వేలంలో రిజిష్టర్ కాని ప్లేయర్లు ఈ మినీ వేలానికి అనర్హులు. కానీ స్టోక్స్‌కు బీసీసీఐ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో అతను పోటీలో ఉండబోతున్నాడు.
ఇవి కూడా చదవండి:
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ బర్త్‌డే విషెస్..
వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!