రో-కో దిగితే రూల్స్ మార్చాల్సిందే!
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:30 AM
జాతీయ జట్టు మ్యాచ్‌లు లేని సమయాల్లో కేంద్ర కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లంతా దేశవాళీ పోటీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ కొన్ని సంవత్సరాల కిందట ఆదేశించింది....
ప్రసార నిబంధనల సవరణ దిశగా బోర్డు
న్యూఢిల్లీ: జాతీయ జట్టు మ్యాచ్‌లు లేని సమయాల్లో కేంద్ర కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లంతా దేశవాళీ పోటీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ కొన్ని సంవత్సరాల కిందట ఆదేశించింది. స్టార్ క్రికెటర్లు దేశవాళీ పోటీల్లో పాల్గొంటే అభిమానులు కూడా స్టేడియాలకు పెద్ద సంఖ్యలో వస్తారనేది బీసీసీఐ ఆలోచన. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవల విజయ్‌హజారే మ్యాచ్‌ల్లో తమ దేశవాళీ జట్లతరపున బరిలోకి దిగినపుడు ఫ్యాన్స్ భారీగా తరలి రావడమే దీనికి చక్కటి ఉదాహరణ. ఈ ఇద్దరు స్టార్ల మ్యాచ్‌లకు హాజరు కాలేకపోయిన ఫ్యాన్స్..వారి ఆటను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించలేక పోయినందుకు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై ఆగ్రహం ప్రకటించారు. ఈక్రమంలో దేశవాళీ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి బీసీసీఐ తన విధానాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా కూడా అంగీకరించారు. ‘100 దేశవాళీ మ్యాచ్‌లు మాత్రమే ప్రత్యక్షం ప్రసారం చేసేలా టెలివిజన్ సంస్థతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందాన్ని సవరించాలని బోర్డు భావిస్తోంది. ‘స్టార్ క్రికెటర్లు ఆడుతున్నందున 100 మ్యాచ్‌లకు మించి ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు తీసుకుంటాం’ అని దేవజీత్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన టీమిండియా ప్లేయర్లు
జెమీమా రోడ్రిగ్స్‌కు బిగ్ షాక్