Share News

Bangladesh Umpire Controversy: థర్డ్‌ అంపైర్‌గా బంగ్లాదేశీ..

ABN , Publish Date - Jan 12 , 2026 | 05:50 AM

భారత్‌లో తమకు భద్రత లేదనే సాకుతో టీ20 వరల్డ్‌కప్‌ వేదికలను మార్చాలని డిమాండ్‌ చేస్తున్న బంగ్లాదేశ్‌కు ఇది ఇబ్బందికర వార్తే...

Bangladesh Umpire Controversy: థర్డ్‌ అంపైర్‌గా బంగ్లాదేశీ..

భారత్‌లో తమకు భద్రత లేదనే సాకుతో టీ20 వరల్డ్‌కప్‌ వేదికలను మార్చాలని డిమాండ్‌ చేస్తున్న బంగ్లాదేశ్‌కు ఇది ఇబ్బందికర వార్తే. కివీ్‌సతో జరిగిన తొలి వన్డేలో టీవీ అంపైర్‌గా బంగ్లా వాసి షరీఫుద్దౌలా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఆటగాళ్ల భద్రతపై ఆందోళనకరంగా ఉంటే అంపైర్‌ను ఎందుకు అనుమతించారని బంగ్లా బోర్డుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తను ఐసీసీతో ఒప్పందం కలిగిన అంపైర్‌ అని, బంగ్లా క్రికెట్‌ బోర్డు నుంచి ఎన్‌ఓసీ అవసరం లేదని ఆ దేశ అంపైర్ల విభాగం చైర్మన్‌ ఇఫ్తికార్‌ రహ్మాన్‌ వెల్లడించాడు.

ఇవీ చదవండి:

ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..

ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..

Updated Date - Jan 12 , 2026 | 05:50 AM