T20 World Cup 2026: భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:13 AM
టీ20 వరల్డ్‌క్‌పలో ఆడేందుకు తమ జట్టు భారత్‌లో అడుగుపెట్టదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మరోసారి స్పష్టం చేసింది. ఆ జట్టు...
తమ నిర్ణయంలో మార్పు లేదన్న బంగ్లాదేశ్
ఢాకా: టీ20 వరల్డ్‌క్‌పలో ఆడేందుకు తమ జట్టు భారత్‌లో అడుగుపెట్టదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మరోసారి స్పష్టం చేసింది. ఆ జట్టు ఆటగాళ్ల భద్రతకు ప్రమాదం లేదని, అలాగే టోర్నీ షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనందున తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని బీసీబీని ఐసీసీ మంగళవారం కోరింది. అయితే తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, వేదికలను భారత్ వెలుపలకు మార్చాలని బీసీబీ మరోసారి కోరింది. ఈ విషయంలో పరస్పరం ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవడానికి చర్చలు కొనసాగించాలని ఇరువర్గాలు అంగీకరించాయి.
ఇవి కూడా చదవండి:
ధనశ్రీతో రియాలిటీ షో.. ఆ వార్తలను ఖండించిన చాహల్
రో-కో నన్ను ‘చోటా చీకూ’ అని పిలిచారు: విరాట్ పోలికలతో ఉన్న బాలుడు