గాయత్రి జోడీ రిటైర్డ్ హర్ట్
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:29 AM
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ జోడీ ట్రీసా జాలీ- గాయత్రి గోపీచంద్ అవుటైంది. మంగళవారం జరిగిన...
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ జోడీ ట్రీసా జాలీ- గాయత్రి గోపీచంద్ అవుటైంది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో చైనీస్ తైజీ జోడీ హు లింగ్ ఫాంగ్-జెంగ్ యు చెతో మ్యాచ్‌లో 7-13తో వెనుకంజలో ఉన్న సమయంలో గాయత్రి-ట్రీసా జంట రిటైర్డ్ హర్ట్‌గా తప్పుకొంది. కాగా, దుబాయ్‌లో చిక్కుకొని భయానక అనుభవాన్ని ఎదుర్కొన్న ఏస్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నమెంట్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!
డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ