క్వార్టర్స్‌లో తన్వీ, మాళవిక
ABN , Publish Date - Mar 20 , 2026 | 06:04 AM
భారత వర్ధమాన షట్లర్లు తన్వీ శర్మ, ఇస్రానీ బారువా, మాళవిక బన్సోడ్ ఓర్లీన్స్ మాస్టర్స్ క్వార్టర్స్‌కు చేరు కోగా..
ఓర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్
ఓర్లీన్స్ (ఫ్రాన్స్): భారత వర్ధమాన షట్లర్లు తన్వీ శర్మ, ఇస్రానీ బారువా, మాళవిక బన్సోడ్ ఓర్లీన్స్ మాస్టర్స్ క్వార్టర్స్‌కు చేరు కోగా.. ఎనిమిదో సీడ్ ఆయుష్ శెట్టి రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో సహచరుల మధ్య గురువారం జరిగిన రౌండ్-16లో తన్వీ 21-14, 21-17తో అన్‌మోల్ ఖర్బ్‌పై, ఇస్రానీ 21-11, 14-21, 21-17తో వెన్ యు జాంగ్ (కెనడా)పై, మాళవిక బన్సోడ్ 24-22, 21-13తో వోంగ్ లింగ్ చింగ్ (మలేసియా)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ 21-9, 18-21, 9-21తో యుడాయ్ ఒకిమోటో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్-హరిహరన్ జంట 26-24, 21-14తో స్కాట్లాండ్ జోడీ అలెగ్జాండర్ డున్-ఆడమ్ ప్రింగిల్‌పై నెగ్గింది.
ఇవి కూడా చదవండి..
భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..
మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..